CDS Gen Bipin Rawat: నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు..

|

Dec 10, 2021 | 8:53 AM

CDS జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. మరికాసేపట్లో కామరాజ్‌ మార్గ్‌లోని రావత్‌ ఇంటికి భౌతికకాయాలను తరలిస్తారు. 11గంటల నుంచి సైనికాధికారుల సందర్శనకు అనుమతిస్తారు.

CDS Gen Bipin Rawat: నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు..
BIPIN RAWAT
Follow us on

CDS జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. మరికాసేపట్లో కామరాజ్‌ మార్గ్‌లోని రావత్‌ ఇంటికి భౌతికకాయాలను తరలిస్తారు. 11గంటల నుంచి సైనికాధికారుల సందర్శనకు అనుమతిస్తారు. ఆ తర్వాత 2గంటల నుంచి రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీ కంటోన్మెంట్‌ బ్రార్‌ స్క్వేర్‌ స్మశాన వాటికల్‌..సైనిక లాంచనాలతో బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులు రావత్‌ అంత్యక్రియలకు హాజరవుతారు. గురువారం రాత్రి పాలెం ఎయిర్‌బేస్‌లో బిపిన్‌ రావత్‌ దంపతుల భౌతికకాయాలకు ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అమరుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రధాని మోడీ.

  • ఉ.11 గంటల నుంచి భౌతికకాయం సందర్శనకు అనుమతి
  • మ.12:30 నుంచి సైనికాధికారులకు అవకాశం
  • మ.2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
  • కామరాజ్‌మార్గ్‌ 3వ నెంబర్‌ బంగ్లా నుంచి అంతిమయాత్ర
  • కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో..
  • సైనిక లాంఛనాలతో బిపిన్‌రావత్‌ దంపతుల అంత్యక్రియలు
  • హాజరుకానున్న శ్రీలంక,నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు

ఇక అదే హెలికాప్టర్‌ ప్రమాదంలో జవాన్‌ సాయితేజ మృతితో చిత్తూరు జిల్లా ఎగువ రేగడలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయితేజ మృతిని తట్టుకోలేకపోతున్నారు అతని కుటుంబసభ్యులు. సాయితేజ చివరి మాటలు తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవాళ సాయితేజ భౌతికకాయానికి డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇప్పటికే సాయితేజ కుటుంబసభ్యుల శాంపిల్స్‌ను సేకరించారు వైద్యులు. సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు సిద్ధంగా ఉండాలని సోదరుడు మహేష్‌కు సమాచారమందించారు అధికారులు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం ఎగువరేగడలో సైనిక లాంచనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి: TS MLC Elections 2021 Live: మొదలైన సందడి.. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికల పోలింగ్..

Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..