
Delhi-Darbhanga Superfast Express: వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగనట్లు రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్.. సరాయ్ భూపత్ స్టేషన్ దాటిపోతున్న క్రమంలో స్లీపర్ కోచ్ నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్.. వెంటనే ట్రైన్ పైలట్, గార్డ్‌కు సమాచారం అందించాడు. దీంతో దీంతో రైలును అక్కడికక్కడే నిలిపేశాడు.
ట్రైన్ ఆపగానే ప్రయాణికులందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు. రైలుకు పూర్తి స్థాయిలో మంటలు అంటుకోగా.. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రైన్ లో మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
#WATCH | Fire broke out in the S1 coach of train 02570 Darbhanga Clone Special when it was passing through Sarai Bhopat Railway station in Uttar Pradesh.
According to CPRO, North Central Railways, there are no injuries or casualties
(Earlier Video; Source: Passenger) pic.twitter.com/mTFHcTlhak
— ANI (@ANI) November 15, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..