లాలూ తనయులు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌లపై హత్య కేసు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్‌ ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు పెద్ద షాకే తగిలింది.. ఆర్‌జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌ తనయులు తేజస్వీయాదవ్..

లాలూ తనయులు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌లపై హత్య కేసు

Updated on: Oct 05, 2020 | 3:56 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్‌ ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు పెద్ద షాకే తగిలింది.. ఆర్‌జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌ తనయులు తేజస్వీయాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌లపై హత్య కేసు నమోదయ్యింది.. ఆర్‌జేడీ నేతలు అనిల్‌కుమార్‌ సాధు, కలో పాశ్వాన్‌లపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది.. ఆదివారం బీహార్‌లోని పూర్నియా జిల్లాలో నివాసం ఉంటున్న మాలిక్‌ ఇంట్లోకి కొందరు దుండగులు చొరబడి అతడిని కాల్చి చంపారు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపుగానే మాలిక్‌ చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.. ఇది ఆర్‌జేడీ పనేనని మాలిక్‌ భార్య ఆరోపించారు. ఇటీవలే మాలిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది ఆర్‌జేడీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి మాలిక్‌ సంసిద్ధమవుతున్నాడు.. అంతలోనే ఆయన హత్యకు గురయ్యారు.. దీని వెనుక కచ్చితంగా కుట్ర ఉందని మాలిక్‌ భార్య అంటున్నారు.. పార్టీ టికెట్‌ అడిగితే 50 లక్షల రూపాయలు ఇస్తే కానీ టికెట్‌ ఇవ్వనని తేజస్వీ యాదవ్‌ చెప్పాడట.. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఈ మధ్యనే మాలిక్‌ విడుదల చేశారు.. అంతే కాకుండా తనను కులంపేరిట తేజస్వీ యాదవ్‌ దూషించారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు మాలిక్‌.. వీటన్నింటిని మనసులో పెట్టుకునే ఆర్‌జేడీ నాయకులు తన భర్తను చంపేశారని మాలిక్‌ భార్య ఆరోపిస్తున్నారు.. ఈ సమయంలో మాలిక్‌ హత్య జరగడం అందరికీ అనుమానాలను కలిగిస్తోంది.. మాలిక్ హ‌త్య‌కేసులో నిందితుల‌ను త్వరలోనే ప‌ట్టుకుంటామ‌ని ఎస్పీ విశాల్ శర్మ చెప్పారు. మాలిక్ శ‌రీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయ‌న్నారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఆర్‌జేడీ హత్య రాజకీయాలు ఇలాగే ఉంటాయని జేడీయూ ఆరోపిస్తోంది..