కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆ 17 సంస్థలపై కేసులు నమోదు..

| Edited By:

May 30, 2020 | 7:40 PM

సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించి.. అలజడి సృష్టించారన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.. 17 సంస్థలపై కేసులు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో.. ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోందని.. ఉత్తరాఖండ్‌ అడవుల్లో.. కార్చిచ్చు చెలరేగుతోందంటూ 2016,2019 సంవత్సరాలకు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారడం.. ఇతర దేశాలు కూడా అదే నిజమని నమ్మి.. పలు ప్రకటనలు చేశాయి. ఈ […]

కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆ 17 సంస్థలపై కేసులు నమోదు..
Follow us on

సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించి.. అలజడి సృష్టించారన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.. 17 సంస్థలపై కేసులు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో.. ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోందని.. ఉత్తరాఖండ్‌ అడవుల్లో.. కార్చిచ్చు చెలరేగుతోందంటూ 2016,2019 సంవత్సరాలకు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారడం.. ఇతర దేశాలు కూడా అదే నిజమని నమ్మి.. పలు ప్రకటనలు చేశాయి. ఈ సోషల్ మీడియా ప్రచారం.. ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని.. బాధ్యతాయుతమైన పలు సంస్థలు కూడా.. నిజనిర్ధారణ చేసుకోకుండా.. ఫేక్‌ ఫోటోలను వైరల్‌ చేశాయని.. సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించిన వారిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు.. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.