ఢిల్లీ అల్లర్ల కేసులో ఇద్దరు నిర్మాతలకు నోటీసులు

|

Sep 14, 2020 | 8:09 PM

దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిర్మాతలకు సమన్లు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో డ్యాక్యుమెంటరీ నిర్మాతలు రాహుల్‌ రాయ్‌, సబా దేవన్‌లు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఢిల్లీ అల్లర్ల కేసులో ఇద్దరు నిర్మాతలకు నోటీసులు
Follow us on

దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిర్మాతలకు సమన్లు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో డ్యాక్యుమెంటరీ నిర్మాతలు రాహుల్‌ రాయ్‌, సబా దేవన్‌లు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ను అరెస్టు చేసిన మరుసటి రోజునే వీరికి సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఢిల్లీ పోలీసులు. ఇందుకు దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లో పోలీసులు రాయ్ పేరును కూడా చేర్చారు.

కాగా, ఈ నిర్మాతలిద్దరు అల్లర్లకు మద్దతు తెలిపే ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. వాట్సఫ్ గ్రూప్ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాల పంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఫిబ్రవరి నెలలో దేశ రాజధాని దిల్లీలో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో 50 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వందల మంది క్షతగాత్రులుగా మిగిలారు. భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన విచారణను దర్యాప్తు బృందం వేగం పెంచారు.