యూపీలో విద్యుత్ ప్లాంట్ ప్రైవేటీకరణ ? 15 లక్షల మంది ఉద్యోగుల ఆందోళన

యూపీలో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కామ్) 'పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్'  ను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర యోచనకు నిరసనగా 15 లక్షలమంది ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు.

యూపీలో  విద్యుత్ ప్లాంట్ ప్రైవేటీకరణ ? 15 లక్షల మంది ఉద్యోగుల ఆందోళన

Edited By:

Updated on: Oct 05, 2020 | 12:15 PM

యూపీలో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కామ్) ‘పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్’  ను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర యోచనకు నిరసనగా 15 లక్షలమంది ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. సోమవారం తమ విధులను బాయ్ కాట్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోని పక్షంలో తాము నిరవధికంగా తమ డ్యూటీలను బహిష్కరిస్తామని విద్యుత్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ అవధేష్ కుమార్ హెచ్ఛరించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసిన పక్షంలో కరెంట్ బిల్లులు అత్యధికంగా వస్తాయని, ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోయి సామాన్య జనం నానా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆయన అన్నారు. మా ఆందోళనలో అన్ని స్థాయిల ఉద్యోగులు పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.