మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది మృతి.. 6గురికి గాయాలు.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

|

Feb 15, 2021 | 3:49 PM

జలగావ్ జిల్లా కింగావ్ గ్రామం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలు మృత్యువాతపడ్డారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది మృతి.. 6గురికి గాయాలు.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
Follow us on

Maharashtra Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జలగావ్ జిల్లా కింగావ్ గ్రామం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలు మృత్యువాతపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఏడుగురు మగవాళ్లు, ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా భావించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారని ఉన్నతాధికారులు తెలిపారు. మృతులంతా అభోడా, కెర్హలా, రవెర్ ప్రాంతాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన ఐదుగురు కూలీలను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. జలగావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తన మనసును కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.