Today Silver Price: దేశ వ్యాప్తంగా వెండి ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన వెండి ధరలు తాజాగా దిగివస్తున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతులపై పన్ను తగ్గిస్తామని తెలుపడంతో బంగారం, వెండి ధరలు కిందకు దిగివస్తున్నాయి. ఇక శనివారం దేశ వ్యాప్తంగా కిలో వెండిపై రూ.250 వరకు తగ్గింది. దేశీయంగా చూస్తే ప్రస్తుతం కిలో వెండి రూ.68,700 ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,300 ఉండగా, ఢిల్లీలో 68,700 ఉంది. చెన్నైలో రూ. 73,300, ముంబైలో 68,700, కోల్‌కతాలో 68,700, బెంగళూరులో రూ.69,500, విజయవాడలో రూ.73,300 ఉంది. అయితే గత నాలుగు రోజులుగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.