Petrol, Diesel Prices: వాహనదారులకు షాకిస్తున్న చమురు సంస్థలు… ఐదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Petrol, Diesel Prices: పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులకు భారంగా మారుతోంది. వాహనాలు ప్రతి ఒక్కరికి ...
Petrol, Diesel Prices: పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులకు భారంగా మారుతోంది. వాహనాలు ప్రతి ఒక్కరికి ఉండే ఈ రోజుల్లో.. ధరలు పెరుగుతుండటంతో జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఎదురవుతోంది. ధరల పెరుగుదలతో వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా ఐదో రోజు ధరలు పెరిగాయి. శనివారం లీటర్ పెట్రోల్‌పై 38 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసలు పెంచాయి చమురు సంస్థలు.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.44 ఉండగా, డీజిల్ రూ.78.74 పైసలు ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.91.96 ఉండగా, డీజిల్ 85.89 పైసలు ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.94.93 ఉండగా, డీజిల్ రూ.85.70కి చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్ ధర రూ.90.70 ఉండగా, డీజిల్ రూ.83.86 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.89.73 ఉండగా, డీజిల్ రూ.82.33 ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.91.40 ఉండగా, డీజిల్ ధర రూ.83.47
కాగా, ప్రమాణాల ఆధారంగా చమురు సంస్థలు ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. అయితే డీలర్లు పెట్రోల్ పంపులను నడుపుతున్న వ్యక్తులు పన్నులు, వారి స్వంత మార్జిన్లను వినియోగదారులకు జోడించిన తర్వాత వారు రిటైల్ ధరలకు వినియోగదారులకు విక్రయిస్తారు.
Also Read:
Today Silver Price: దేశీయంగా తగ్గుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..