రైతులకు శుభవార్త.. రూ. 3లక్షల వరకు వడ్డీ లేని రుణం.. కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్

|

Feb 10, 2021 | 2:32 PM

పంజాబ్రావు దేశ్‌ముఖ్ వడ్డీ రాయితీ పథకం కింద రూ .3 లక్షల వరకు వడ్డీ లేని గరిష్ట రుణాలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.

రైతులకు శుభవార్త.. రూ. 3లక్షల వరకు వడ్డీ లేని రుణం.. కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్
Follow us on

Farmers interest free loans : దేశానికి రైతే వెన్నుముక. రైతు బాగుంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఇదే క్రమంలోనే అన్నదాతల ఆదాయాన్ని పెంపొందించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పంజాబ్రావు దేశ్‌ముఖ్ వడ్డీ రాయితీ పథకం కింద రూ .3 లక్షల వరకు వడ్డీ లేని గరిష్ట రుణాలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. ఠాక్రే ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఎంతో ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది. రైతులకు ఇప్పుడు పంజాబ్రావు దేశ్ముఖ్ వడ్డీ రాయితీ పథకం కింద రూ .3 లక్షల వరకు వడ్డీ లేని గరిష్ట రుణాలు ఇవ్వనున్నారు.

అలాగే, రుణ మాఫీ ఇవ్వని రైతులకు ఈ కొత్త పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని మహారాష్ట్ర సర్కార్ వెల్లడించింది. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సహకార మంత్రి బాలాసాహెబ్ పాటిల్, వ్యవసాయ మంత్రి దాదాజీ భూసే తెలిపారు. రైతులకు సకాలంలో రుణాలు ఇస్తేనే వ్యవసాయం కోసం ప్రణాళిక వేసుకోవడం సులభం అవుతుందన్నారు. దీంతో రైతుల ఇబ్బందులు, విత్తనాల కాలం అందుతాయన్నారు.

రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి మంగళవారం సీఎం ఉద్దవ్ ఠాక్రే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో రైతుల మేలు కోసం వడ్డీ లేని రుణ పథకానికి సీఎం ఆమోదం తెలిపారు. కాగా, పంజాబ్రావు దేశ్‌ముఖ్ వడ్డీ రాయితీ పథకం కింద రైతులకు రూ. లక్ష వరకు రుణాలు వడ్డీ లేకుండా, రూ .3 లక్షల వరకు తీసుకునే రుణాలపై 2% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు రూ .3 లక్షల వరకు రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని థాకరే ప్రభుత్వం తెలిపింది.

రైతులు మార్చి 31 లోగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ పథకం వల్ల ప్రయోజనం పొందని రైతులకు ప్రయోజనాలు అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సహకార విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రైతులు మార్చి 31 లోగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాల సూచించారు. ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు జిసిలోని ప్రతి రైతుకు కెసిసి రూపాయి డెబిట్ కార్డు పంపిణీ చేయాలని తెలిపారు. అలాగే ప్రతి అన్నదాతకు ఎటిఎంల ద్వారా డబ్బును ఉపసంహరించుకునేలా అవకాశం కల్పించాలని బ్యాంకులను ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం.

Read Also…  యుక్త వయసు మైనర్లు ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటే చెల్లుతుంది.. సంచలన తీర్పు ఇచ్చిన హర్యానా హైకోర్టు