ఈ నెల 26 న ఢిల్లీ శివారులో ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోయినా తాము దాన్ని నిర్వహించి తీరుతామని పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ నేత సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రదర్శన జరుగుతుందని ఆయన చెప్పారు. ఇందుకు వారి అనుమతితో తమకు నిమిత్తం లేదన్నారు. ఏయే రూట్లలో ర్యాలీ జరగాలో తమకు, పోలీసులకు మధ్య ఓ అంగీకారం కుదిరినట్టు ఆయన వెల్లడించాడు. క్రమశిక్షణతో, శాంతియుతంగా తాము కాగా-దీన్ని నిర్వహిస్తామన్నారు. నాలుగు రూట్ల ద్వారా ర్యాలీ నిర్వహణకు వీరికి, పోలీసులకు మధ్య ఒప్పందం వంటిది కుదిరింది. సింఘు, టిక్రి బోర్డర్స్, ఘాజీపూర్ యూపీ గేట్, చిల్లా రూట్ల ద్వారా ఇది సాగనుంది.ఈ ర్యాలీలో 2 లక్షల ట్రాక్టర్లతో అన్నదాతలు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల రైతులు కూడా సింఘు బోర్డర్ చేరుకున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల అన్నదాతలు మొదటి నుంచి నిరసన చేస్తున్నారు. అటు- ఇప్పటివరకు సుమారు 70 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురై కొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు చనిపోయారు.