#WATCH Video – Delhi police: గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసాకాండ అనంతరం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా ఘాజీపూర్ – ఢిల్లీ రోడ్డుపై (ఇనుప చువ్వలను) మేకులను అమర్చడంతోపాటు బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు గురువారం మేకులను తొలగిస్తున్నట్లు వీడియో వైరల్ అయింది. విమర్శలు వెల్లువెత్తిన అనంతరం ఢిల్లీ పోలీసులు మేకులను తొలగించారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. దీంతోపాటు పలు ఛానెళ్లు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా రోడ్డుపై ఉంచిన మేకులను తొలగించడం లేదని రీ పోజిషన్ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరో చోటుకు మారుస్తున్నామని క్లారిటీ ఇస్తూ ఢిల్లీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
#WATCH | Nails that were fixed near barricades at Ghazipur border (Delhi-UP border) are being removed. pic.twitter.com/YWCQxxyNsH
— ANI (@ANI) February 4, 2021
Also Read: