Farmers Protest: ఢిల్లీలో రైతు ఉద్యమం ఎఫెక్ట్.. ఏడాదిలో రూ. 7 కోట్లు ఖర్చు చేశారు.. రాజ్యసభలో కీలక ప్రకటన..!

|

Dec 12, 2021 | 8:36 AM

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు

Farmers Protest: ఢిల్లీలో రైతు ఉద్యమం ఎఫెక్ట్.. ఏడాదిలో రూ. 7 కోట్లు ఖర్చు చేశారు.. రాజ్యసభలో కీలక ప్రకటన..!
Farmers
Follow us on

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో శాంతించిన రైతులు.. ఆందోళనలను విరమించుకున్నారు. అయితే, రైతుల ఆందోళన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూసతున్నాయి. అదేంటంటే.. రైతులు చేపట్టిన ఆందోళనలను నియంత్రించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించాల్సి వచ్చిందట. ఆందోళన చేస్తున్న రైతులు.. ఢిల్లీ సరిహద్దును దాటి ఎట్టిపరిస్థితుల్లోనూ నగరంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండేందుకు భద్రతా దళాలు చాలా శ్రమించాల్సి వచ్చింది. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంపీ ఎం మహ్మద్ అబ్దుల్లా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది.

2020 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ కాలంలో ఎంత మంది రైతులు చనిపోయారు? చనిపోయిన రైతులకు ప్రభుత్వం ఏమైనా పరిహారం అందజేసిందా? ఆందోళన సమయంలో నిరసన స్థలాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతకు ఎంత ఖర్చు చేశారు? నీటి కొరత, వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించిన మరణాలు, నిరసన తెలిపిన రైతుల ఆత్మహత్యలు, ఇతర అంశాలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటాను సేకరించిందా? మృతుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం, ఉద్యోగావకాశాల రూపంలో సాయం అందించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ ఏదైనా విధానాన్ని ప్రకటించిందా? అని ఎంపీ కుమార్ కేత్కర్ ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందించిన కేంద్ర హోంశాక సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘వివిధ నిరసన ప్రదేశాలలో రైతులకు భద్రత కల్పించడానికి ఢిల్లీ పోలీసులు చేసిన ఖర్చుల వివరాలను హోం మంత్రిత్వ శాఖకు అందించారు. దీని ప్రకారం ఢిల్లీ పోలీసులు.. రైతుల ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుండి 20 నవంబర్, 2021 వరకు రూ. 7 కోట్ల 38 లక్షల 42 వేల 914 ఖర్చు చేశారు. ఇదే సమయంలో రైతుల మరణాలపై స్పందించిన ఆయన.. “రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. దీనికి సంబంధించిన సమాచారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహించబడుతుంది. అలాగే, అటువంటి సంఘటనలపై పరిహారం విషయాలపై, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చర్యలు తీసుకుంటాయి.’’ అని వివరణ ఇచ్చారు.

Also read:

Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!

Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!

Dysfunctional Cells: షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆ.. కణాలను’ తొలగిస్తే.. శాశ్వత నివారణ అంటున్న శాస్త్రవేత్తలు