Farmers Protest : రైతు నిరసనలు తీవ్రతరం.. ఈనెల 26న దేశవ్యాప్త నిరసన.. మద్దతు పలికిన 12 ప్రధానపార్టీలు

|

May 24, 2021 | 7:10 AM

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతల ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయకుండా ఆరు నెలలుగా రైతులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.

Farmers Protest : రైతు నిరసనలు తీవ్రతరం.. ఈనెల 26న దేశవ్యాప్త నిరసన.. మద్దతు పలికిన 12 ప్రధానపార్టీలు
Follow us on

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతల ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయకుండా ఆరు నెలలుగా రైతులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా బుధవారం చేపట్టబోయే దేశవ్యాప్త నిరసనకు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఈ మేరకు ఆ పార్టీలు ఆదివారం వెల్లడించాయి.

కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో తాజా నిరసనకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. రైతులకు మద్దతు తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనపై సోనియా గాంధీ(కాంగ్రెస్‌), హెచ్‌డీ దేవెగౌడ(జేడీఎస్‌), శరత్‌ పవార్‌(ఎన్సీపీ), మమతా బెనర్జీ(టీఎమ్‌సీ), ఉద్ధవ్‌ ఠాక్రే(శివసేన), ఎమ్‌కే స్టాలిన్‌(డీఎమ్‌కే), హేమంత్‌ సొరెన్‌(జేఎమ్‌ఎమ్‌), ఫరూక్‌ అబ్దుల్లా(జేకేపీఏ), అఖిలేశ్‌ యాదవ్‌(ఎస్పీ), తేజస్వి యాదవ్‌(ఆర్జేడీ), డి రాజా(సీపీఐ), సీతారాం ఏచూరి(సీపీఎమ్‌) సంతకాలు చేశారు.

2020 సెప్టెంబర్‌లో భారత పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చర్యలకు వ్యతిరేకంగా రైతులు నిరసన కొనసాగుతున్నారు. రైతు సంఘాలు, వారి ప్రతినిధులు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల అమలుపై భారత సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులను రైతు సంఘం నాయకులు స్వాగతించారు. కానీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీని తిరస్కరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు నెలలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా ఎదురుదాడి చేయడాన్ని రైతు సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు నిరసనల తర్వాత తమపై ఉక్కుపాదం మోపేందుకు ఇంటర్నెట్‌పై నిషేధం విధించడం, పోలీసుల వేధింపుల నేపథ్యంలో ఈనెల 26న దేశవ్యాప్తంగా మరోసారి నిరసనకు రైతు సంఘాలు సన్నద్దమవుతున్నాయి.

Read Also… Murder: అయోధ్య జిల్లాలో దారుణం.. దంపతులు సహా ముగ్గురు పిల్లల హత్య