Budget 2021: దేశ రైతాంగానికి కేంద్రం తీపి కబురు చెప్పనుందా? కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు ఇచ్చే రూ.6 వేలను పెంచనున్నారా? ఈ ప్రశ్నలకు పీఎంఓ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. రానున్న బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెబుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందట.
అంతేకాదు.. ఈ అంశాన్ని బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ వేదికగా ప్రకటించాలని నిర్ణయించారట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పెంపునకు సంబంధించి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేయడం ద్వారా రైతులను కొంతైనా శాంతపరచ వచ్చునని ప్రభుత్వం భావిస్తుందట. మరి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇచ్చే మొత్తం ఎంత పెంచుతారనే దానిపై క్లారిటీ రావాలంటే బడ్జెట్ సమావేశాల వరకు వేచి చూడాల్సిందే.
Also read:
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రిపబ్లిక్ డే ఆఫర్.. ఇక నుంచి అన్ని సర్కిళ్లలో..
Air pollution: వాయు కాలుష్యం కారణంగా అబార్షన్లు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన సంచలన విషయాలు