Farm Laws – Narendra Singh Tomar : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. ఈ నిరసనలు కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమని ఆయన వెల్లడించారు. అయితే ఈ చట్టాల్లో ఎటువంటి సమస్యలు లేవని.. రైతులను కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కొత్త సాగు చట్టాలపై చర్చిస్తున్నందుకు ధన్యవాదాలన్నారు. ఈ చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించడంపై తోమర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చట్టాలు నల్ల చట్టాలు ఎలా అయ్యాయో చెప్పాలని రైతు సంఘాలను కోరారని.. కానీ ఎవరూ కూడా తనకు వివరంగా చెప్పలేదన్నారు. కానీ ఈ చట్టాలను చూపించి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టంచేశారు. అయితే కాంగ్రెస్ వారి రక్తంతో వ్యవసాయం చేస్తోందని పేర్కొనడంతో.. తోమర్ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అనంతరం తోమర్ మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా వేగంగా పేంచేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వం మీద కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: