Farmers Protest: ‘ఇప్పట్లో మా ఆందోళన ఆగదు, వచ్ఛే అక్టోబరు వరకు సాగుతుంది’, రైతు నేత రాకేష్ తికాయత్

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసేవరకు అన్నదాతలు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లబోరని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఈ ఆందోళన

Farmers Protest: ఇప్పట్లో మా ఆందోళన ఆగదు, వచ్ఛే అక్టోబరు వరకు సాగుతుంది, రైతు నేత రాకేష్ తికాయత్

Edited By:

Updated on: Feb 02, 2021 | 6:26 PM

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసేవరకు అన్నదాతలు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లబోరని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఈ ఆందోళన అక్టోబరు నెల లోగా ముగిసే అవకాశాలు లేవన్నారు.  మంగళవారం సింఘు బోర్డర్ లో రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. మా నినాదం ‘ కానూన్ వాప్ సీ నహీ..తో ఘర్ వాప్ సీ నహీ’ (చట్టాలు వెనక్కి తీసుకోనంతవరకు మేం ఇళ్లకు తిరిగి వెళ్లే ప్రసక్తి లేదు) అని వ్యాఖ్యానించారు. అక్టోబరు వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని, ఇప్పట్లో విరమించే అవకాశం లేదన్నారు.

విపక్షాలు తమ రైతులతో చేతులు కలిపితే తమకు అభ్యంతరం లేదని, కానీ సమస్యను రాజకీయం చేయరాదని కోరుతున్నామని తికాయత్ చెప్పారు. వేదికమీద ఏ రాజకీయ నేతకూ తాము మైక్ ఇవ్వడంలేదని, ఇవ్వబోమని స్పష్టం చేశారు. మాది  రాజకీయ రహిత నిరసన.. స్టేజీ మీద ఏ పొలిటీషియన్ ని కూడా అనుమతించబోము అన్నారు. ఢిల్లీ శివార్లలో రైతులు ట్రాఫిక్ ని ఆపడంలేదని, పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వల్లే ట్రాఫిక్ మెల్లగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. తాజాగా నగరంలోనూ,  నిరసన స్ధలాల్లో కొన్ని చోట్ల పోలీసులు ఇనుప కంచెలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారని, కానీ పెద్ద సంఖ్యలో రానున్న అన్నదాతల సమూహాలను ఇవి అడ్డుకోజాలవని రాకేష్ తికాయత్ అన్నారు. ఏమైనా  శాంతియుతంగా ఆందోళన సాగాలన్నదే తమ లక్ష్యమన్నారు.

ఇలా ఉండగా పోలీసులు అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలంటూ ఢిల్లీహైకోర్టులో  ఓ స్వచ్చంద  సంస్థ పిటిషన్ ని దాఖలు చేసింది. తమది రైతు అనుకూల సంస్థ అని పేర్కొంది. అయితే దీన్ని విచారించేందుకు నిరాకరించిన కోర్టు….రైతుల దాడుల్లో అనేకమంది పోలీసులు కూడా గాయపడిన విషయాన్నిపరోక్షంగా  గుర్తు చేసింది.