‘అమ్మా ! ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని మీ కుమారుడికి చెప్పండి’, ప్రధాని మోదీ తల్లికి ఓ రైతు సుదీర్ఘ లేఖ

| Edited By: Pardhasaradhi Peri

Jan 24, 2021 | 3:24 PM

వివాదాస్పద రైతు చట్టాలను మూడింటినీరద్దు చేయాలని మీ కుమారునికి నచ్చజెప్పాలని కోరుతూ ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి ఓ రైతు..

అమ్మా ! ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని మీ కుమారుడికి చెప్పండి, ప్రధాని మోదీ తల్లికి ఓ రైతు సుదీర్ఘ లేఖ
Follow us on

వివాదాస్పద రైతు చట్టాలను మూడింటినీరద్దు చేయాలని మీ కుమారునికి నచ్చజెప్పాలని కోరుతూ ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి ఓ రైతు సుదీర్ఘ లేఖ రాశాడు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాకు చెందిన హర్ ప్రీత్ సింగ్ అనే ఈ అన్నదాత..ఎంతో భారమైన హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నానని తెలిపాడు. ఈ దేశానికి ఆహారాన్ని అందించే రైతులు ఢిల్లీ రోడ్లపై పడుకోవాల్సి వస్తోందని, శీతాకాలంలో చలికి గజగజ వణకుతూ గడుపుతున్నారని, వీరిలో పిల్లలు, మహిళలు, 90 నుంచి 95 ఏళ్ళ వృధ్ధులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నాడు. నిరసన చేస్తున్నవారిలో పలువురు అస్వస్థులయ్యారని, కొందరు మరణించగా. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నాడు.

ఈ మూడు చట్టాలు అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ పెద్దల ప్రయోజనాల కోసమే రూపొందించారన్నారు. కొన్ని రోజుల క్రితం సిమ్లాలో పోలీసులు తనను అరెస్టు చేశారని హర్ ప్రీత్ సింగ్ వెల్లడించాడు. ఎంతో ఆశతో మీకు ఈ లేఖ రాస్తున్నానని, మీ కుమారుడు ఈ దేశ ప్రధాని అని, తల్లి మాటలను ప్రతి తనయుడూ వింటాడని ఆయన అన్నాడు. అలాగే ఒక తల్లి మాత్రమే తన కొడుకును శాసించగలదని కూడా హర్ ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు.మీ మాటలు విని మీ కుమారుడు ఈ చట్టాలను రద్దు చేస్తే ఈ దేశమంతా మిమ్మల్ని ప్రేమిస్తుందని, అభిమానిస్తుందని కూడా అన్నారు.   కాగా 100 ఏళ్ళ హీరాబెన్ మోదీ ఈ లేఖపై స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.