Tractor Rally on Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిరసన తెలుపాలనుకున్న రైతులు అనుకున్నది సాధించారు. పోలీసుల అంక్షలు అధిగమిస్తూ కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఎర్రకోటను చేరుకుంది. దేశం నలుమూలాల నుంచి చేరుకున్న రైతులు ఎర్రకోటను ముట్టడించారు.
అంతకు ముందు పోలీసులు అనుమతించిన సమయంలో కాకుండా ముందుగానే ర్యాలీ మొదలుపెట్టిన సెంట్రల్ ఢిల్లీలోకి రావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దారికి అడ్డుపెట్టిన బారికేడ్లను తొక్కేసుకుంటూ రైతులు ముందుకు దూసుకువచ్చారు. ఈ సందర్భంగా కొందరు నిహంగ్ ఆందోళనకారులు తమ దగ్గర ఉన్న ఖడ్గాలను పోలీసులపై దూసి భయాందోళనలకు గురిచేశారు.
Delhi: Another protestor puts a flag on the pole at Red Fort#RepublicDay pic.twitter.com/lyRTnQjRPz
— ANI (@ANI) January 26, 2021
Read Also… దేశ రాజధానిలో బారికేడ్లను లెక్క చేయని రైతు సంఘాలు.. ఉద్రిక్తతంగా మారిన ట్రాక్టర్ ర్యాలీ