పేద, మధ్యతరగతి వర్గాలకు రూ.500 లేదా రూ.1000 కరెంట్ బిల్లు వస్తేనే భారంగా భావిస్తారు. కానీ ఈ మధ్య విద్యుత్ సిబ్బంది పొరపాట్ల వల్ల లక్షల్లో బిల్లు వస్తుంది. ఒక బల్బ్, ఒక ఫ్యాన్ ఉన్న ఇళ్లకు కూడా లక్షల్లో బిల్లు వేస్తున్నాడు. ఇదేంటని అడిగితే రీడింగ్ చూడటానికి వచ్చినవాళ్లు.. మాకేం సంబంధం లేదు ఉన్నతాధికారులను కలవండి అని చెప్పి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ రైతు రూ.1,50,000 అని వేశారు విద్యుత్ శాఖ అధికారులు. బిల్లు కట్టలేనని చెప్పిన ఆ రైతును అందరి ముందు కొట్టారు. మనస్తాపం చెందిన ఆ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అత్రౌలీ తెహ్సిల్‌లో శనివారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రామ్‌జీ లాల్ అనే రైతు సునైరా గ్రామంలో నివశిస్తున్నాడు . అతనికి ఇంటి కరెంట్ బిల్లు రూ.1,50,000 వచ్చింది. అయితే తనకు అంత బిల్లు ఎలా వచ్చిందో తెలియదని, ఆ డబ్బు కట్టే స్థోమత తన దగ్గరలేదని విద్యుత్ శాఖ అధికారులకు మొర పెట్టుకున్నాడు సదరు రైతు. అయితే, ఆయన విన్నపాన్ని పట్టించుకోకపోగా.. కుటుంబ సభ్యుల ముందే కొట్టారు. మనస్థాపంతో రామ్‌జీ లాల్ తనువు చాలించాడు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. రైతు మృతికి కారణమైన విద్యుత్ శాఖ అధికారులను వెంటనే అరెస్టు చేయాలని మృతదేహంతో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు బాధితుడి బంధువులు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పారు.
Also Read:
Viral News: “మూడేళ్లకే దున్నేస్తున్నాడు”.. నెట్టింట వైరల్‌గా మారిన బుడ్డోడి వీడియో
ప్రేమ జంటలు ఒక్కటయ్యే ఆలయం.. తెలంగాణలో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ సదనందాలయం