
పూణే నుండి జమ్మూ తావికి వెళ్తున్న జీలం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఒక వ్యక్తి రైల్వే సిబ్బందికి పట్టుబడిన ఘటన ఝాన్సీలో వెలుగు చూసింది. టికెట్ లేని ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తుండగా.. ట్రైన్‌లోకి వచ్చిన టికెట్ తనిఖీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో, అతను ఇంతకు ముందు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఆ వ్యక్తి నుంచి రూ.1650 నగదు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పూణే నుండి జమ్మూ తావికి వెళ్తున్న జీలం ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో ఒక వ్యక్తి ఎక్కడాడు. అయితే పండగ పూర్తైన సందర్భంగా జనరల్ బోగీలో చాలా మంది ప్రయాణికులు టికెట్ లేకుండా ఎక్కారు. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి తనను తాను టిటిఇగా చెప్పుకుంటూ ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అతనిపై అనుమానం వచ్చిన రైలులో ఉన్న ఒక ప్రయాణీకుడు అతన్ని డబ్బు వసూలు చేస్తున్న దృశ్యాలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారి రైల్వే అధికారుల దృష్టికి చేశాయి.
దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీస్ ఫోర్స్, టికెట్ తనిఖీ సిబ్బంది ట్రైన్ గ్వాలియర్ చేరుకున్న తర్వాత ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.1650 నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇతను ఇంతకు ముందు కూడా రెండు సార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.