ఫేస్ బుక్ ప్రతినిధులకు పార్లమెంటరీ కమిటీ సమన్లు

కాంగ్రెస్ నేత శశిథరూర్ అధ్యక్షతన గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట ఫేస్ బుక్ ప్రతినిధులు హాజరు కానున్నారు. సెప్టెంబరు 2 న తమ ఎదుట హాజరు కావాలంటూ..

ఫేస్ బుక్ ప్రతినిధులకు పార్లమెంటరీ కమిటీ సమన్లు

Edited By:

Updated on: Aug 20, 2020 | 9:11 PM

కాంగ్రెస్ నేత శశిథరూర్ అధ్యక్షతన గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట ఫేస్ బుక్ ప్రతినిధులు హాజరు కానున్నారు. సెప్టెంబరు 2 న తమ ఎదుట హాజరు కావాలంటూ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీపై గల పార్లమెంటరీ స్థాయీ సంఘం వీరికిసమన్లు జారీ చేసింది.  బీజేపీ నేతల ప్రసంగాలను ఫేస్ బుక్ పక్కన పెడుతోందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా శశిథరూర్ ను ఈ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఇద్దరు బీజేపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కోరారు. అయితే ఇంత జరుగుతున్నా థరూర్ మౌనంగా ఉన్నారు.