PM Modi: గొప్ప సంస్కృతిని చాటిచెప్పిన తీరు అద్భుతం.. కాశీ తమిళ సంగమంపై ప్రధాని మోదీ లేఖ..

తమిళనాడు ప్రజలు ప్రధానికి రాసిన వందలాది లేఖల పట్ల ఉత్సాహం చూపిన ప్రధాని వారిని ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పతాకధారులుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

PM Modi: గొప్ప సంస్కృతిని చాటిచెప్పిన తీరు అద్భుతం.. కాశీ తమిళ సంగమంపై ప్రధాని మోదీ లేఖ..
PM Modi

Updated on: Apr 03, 2023 | 7:09 PM

కాశీ తమిళ సంగమంలో పాల్గొనే వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. మీరు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ సభ్యులు అని పేర్కొన్నారు. ఇటీవల వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంగమం వద్ద తమ ఉత్కృష్ట అనుభవాలను పంచుకునేందుకు తమిళనాడు ప్రజలు ప్రధానికి రాసిన వందలాది లేఖల పట్ల ఉత్సాహం చూపిన ప్రధాని వారిని ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పతాకధారులుగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు కాశీ సంస్కృతిని, అక్కడి ప్రజలను దగ్గరి నుంచి తెలుసుకునే అవకాశం లభించిందని ఆనందం వ్యాక్తం చేశారు ప్రధాని మోడీ. కాశీలో తమిళ భాషా సౌందర్యాన్ని, తమిళనాట గొప్ప సంస్కృతిని చాటిచెప్పిన తీరు అద్భుతమని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.

కాశీ, తమిళనాడు మధ్య శతాబ్దాల నాటి సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ ఈ లేఖలో ఇలా అన్నారు. తమిళనాడు ప్రజలతో కాశీకి సుదీర్ఘమైన, శాశ్వతమైన అనుబంధం ఉందన్నారు. వారు సంస్కృతి, నాగరికత అనే రెండింటిని ఓకే వస్త్రంతో జోడించారని పేర్కొన్నారు. కాశీ తమిళ సంగమం ఆ చారిత్రాత్మక జ్ఞాపకాలను పునరుద్ధరించింది. మన దేశంలోని వివిధ ప్రాంతాలు ఎంత లోతుగా అనుసంధానించబడి ఉన్నాయో పునరుద్ఘాటించింది.

అదే సమయంలో స్వాతంత్ర్య అమృత్‌కాల్ సందర్భంగా, ఉజ్వలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రజల ప్రయత్నాలు బలపడతాయని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. అతను ఇలా వ్రాశాడు, “రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాల్ సమయంలో దేశం మొత్తం బలమైన, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి మార్గాలను చర్చిస్తున్న తరుణంలో, మన దేశ ఐక్యతను మరింత లోతుగా చేయడానికి ప్రతి ప్రయత్నం ముఖ్యమైనది. అద్భుతమైన స్మారక కట్టడాన్ని నిర్మించడానికి బలమైన పునాది చాలా కీలకం.

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల మనోభావాల‌ను మెచ్చుకున్న ప్ర‌ధాన మంత్రి, దేశ స‌మ‌గ్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసేందుకు సంగ‌మ‌లు త‌న‌ను ప్రేరేప‌ణ‌ చేశాయ‌ని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం