AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సారీ అమ్మ.. మీ కలలను నేను నెరవేర్చలేను.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్‌ విద్యార్థి సూసైడ్‌ నోట్

జోష్‌ మూవీ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో చదువు ఒత్తిడి తట్టుకోలేక ఒక విద్యార్థి సూసైడ్‌ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను వివరిస్తూ నాగచైతన్య ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుందా? అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ కూడా రిపీట్ అయింది. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఒక నీట్‌ విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నోట్‌లో ఆ విద్యార్థి రాసిన లైన్స్‌ చదివిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కక తప్పదు.

సారీ అమ్మ.. మీ కలలను నేను నెరవేర్చలేను.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్‌ విద్యార్థి సూసైడ్‌ నోట్
Neet Student Suicide
Anand T
|

Updated on: Nov 08, 2025 | 4:23 PM

Share

చదువు ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటన రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షలో ఫెయిలయ్యామని.. అనుకున్నన్ని మార్కులు రాలేదని.. చదువు ఒత్తడి భరించలేకపోతున్నామని.. ఇలా అనేక కారణాలో విద్యార్థులు అర్ధాంతరంగా తమ జీవితాలకు పుల్‌స్టాప్ పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి.. చదువు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు తన మరణానికి గల కారణాలను కూడా అతను సూసైడ్‌ నోట్‌లో ప్రస్తావించాడు. సూసైడ్‌ నోట్‌లో ఆ విద్యార్థి రాసిన లైన్స్‌ చదివిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి.. రాత్రిపూట.. పొదల్లొంచి వింత శబ్ధాలు.. టార్చ్‌వేసి చూడగా..

వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాంపూర్‌కు చెందిన మహమ్మద్ ఆన్ (21) అనే యువకుడు నీట్ కోచింగ్ కోసం ఇటీవలే కాన్పూర్‌లోని ఓ హాస్టల్‌లో చేరాడు. అయితే శుక్రవారం అతని ఫ్రెండ్ బయటకు వెళ్దామని మహమ్మద్‌ను పివగా వెళ్లేందుకు అతను నిరాకరించాడు. అయితే అతని ఫ్రెండ్‌ తిరిగి వచ్చే సరికి హాస్టల్‌ గదిలో లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా మహమ్మద్‌ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని ఫ్రెండ్‌ వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

దీంతో వారు వచ్చి హాస్టల్‌ డోర్స్‌ పగుళగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మహమ్మద్‌ రూమ్‌లో ఉన్న ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇది చూసిన వారంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. ఆ పక్కనే ఉన్న సూసైడ్‌ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిట్‌లకు తరలించారు.

ఇది కూడా చదవండి:ఎలుకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్.. ఇది మీ ఇంట్లో ఉంటే.. వాటికి దడే!

ఇక రూమ్‌లో దొరికన సూసైడ్‌ నోట్‌లో మహమ్మద్ ఇలా రాసుకొచ్చాడు.. అమ్మా, నాన్న నన్ను క్షమించండి. ఈ తీవ్రమైన ఒత్తిడితో.. నేను మీ కలలను నెరవేర్చలేను. అందుకే నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను. దీనికి మరెవరూ బాధ్యులు కాదు.. దీనికి నేనే బాధ్యుడిని” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నోట్‌ చదివిన మహమ్మద్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.