కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం.. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో గుజరాత్‌ మాజీ సీఎం

గుజరాత్‌లోని భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల లిస్ట్‌లో ఆయన పేరు ఉండడంతో ఈ విమానంలో ఆయన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం.. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో గుజరాత్‌ మాజీ సీఎం
Vijay Rupani

Updated on: Jun 12, 2025 | 3:30 PM

గుజరాత్‌లోని భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మాదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. ప్రయాణికులతో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న లిస్ట్‌లో ఆయన పేరు ఉండడంతో ఆయన కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఆయన ఈ విమానంలో ఉన్నారా లేదా, అనే విషయాన్ని ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేము, ఎందుకు కంటే విమానంలో ఉన్న ప్రయాణికుల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. కేవలం లిస్ట్‌లో ఆయన పేరు ఉన్నందున ఆయన కూడా ఈ విమానంలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. కాగా విజయ్‌ రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2022 రాష్ట్ర ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా చేశారు.

Rupani Vijay

అయితే 230 మంది ప్రయాణికులతో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిర్‌ ఇండియా 787-8 డ్రీమ్‌లైనర్ విమానం
టేకాప్‌ అయిన కాసేపటికే కూలిపోయింది. ఫ్లైట్‌ కూలిపోవడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి వెలువడిన దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో మొత్తం కమ్ముకుపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఎయిర్‌ పోర్ట్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సమాచారం అయితే అందలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..