EPFO Interest Rates: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో షాక్.. వడ్డీ రేటు మరింతగా తగ్గింపు.!!

|

Feb 16, 2021 | 3:34 PM

EPFO Interest Rates: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో షాక్ తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును..

EPFO Interest Rates: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో షాక్.. వడ్డీ రేటు మరింతగా తగ్గింపు.!!
Follow us on

EPFO Interest Rates: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో షాక్ తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ రిటైర్మెంట్ ఫండ్ బాడీ మరింతగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల మంది పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు మరోసారి నిరాశ కలగనుంది. కరోనా కారణంగా పెరిగిన విత్ డ్రాయల్స్, తగ్గిన కంట్రీబ్యూషన్లు, ఫండ్ నిధుల నుంచి రాబడులు తగ్గడం వంటి కారణాలు వల్ల వడ్డీ రేటుపై కోత పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

2019లో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.65 శాతం కాగా.. 2020 ఆర్ధిక సంవత్సరానికి వచ్చేసి అది కాస్తా 8.5 శాతానికి తగ్గింది. ఇక 2020-21లో భారీగా విత్ డ్రాయల్స్ పెరగడం, కంట్రీబ్యూషన్లు తగ్గడం వంటి కారణాలు ఈపీఎఫ్ఓ రాబడులపై ప్రభావం చూపించాయి. వీటన్నింటినీ కూడా అంచనా వేసి ఈ ఏడాది పీఎఫ్ వడ్డీ రేటును ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ(ఎఫ్ఐఏసీ) నిర్ధారించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 4న జరిగే ఈపీఎఫ్ఓ అత్యున్నత సమావేశంలో వడ్డీ రేటుపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!