Electric Scooter: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.53 వేల తగ్గింపు..

మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా ? మీ బిజినెస్‌కు ఉపయోగపడే మోడల్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు ఈ డెలివరీ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకేవాల్సిందే. మరో విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ వ్యాపార, ఇంటి అవసరాలకు వినియోగపడేలా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిసౌంట్ ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

Electric Scooter: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.53 వేల తగ్గింపు..
Elcetric Scooter

Updated on: Aug 27, 2023 | 8:56 AM

మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా ? మీ బిజినెస్‌కు ఉపయోగపడే మోడల్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు ఈ డెలివరీ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకేవాల్సిందే. మరో విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ వ్యాపార, ఇంటి అవసరాలకు వినియోగపడేలా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిసౌంట్ ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. కనీవినీ ఎరుగని డీల్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌లో ఈఓఎక్స్ బ్రాండ్ కింద డెలివరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకానికి వచ్చింది. ఈ స్కూటర్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో ఏకంగా 53 వేల రూపాయలకు పైగా డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.

వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,29,000గా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని కేవలం రూ. 79,999కే కొనుక్కోవచ్చు. అంటే మీకు ఏకంగా 38 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే రూ. 4 వేల 500 వరకు అదనంగా డిస్కౌంట్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. అప్పుడు మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 75,499కే లభించినట్లు అవుతుంది. అయితే ఇది తక్కువ ధర అని చెప్పుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఈ డెలివరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై తక్కువగా ఉండే ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 3800 నుంచి అందుబాటులో ఉంది. 24 నెలల కాలానికి ఇది ఉంటుంది.

ఒకవేళ 18 నెలల వరకు టెన్యూర్ పెట్టుకున్నట్లయితే నెలకు రూ.5 వేలు పడుతుంది. అలా వద్దు.. 12 నెలల వరకు మాత్రమే ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 7200 చెల్లించాలి. ఇక 9 నెలల ఈఎంఐకి అయితే నెలకు రూ. 9400 పడుతుంది. 6 నెలల టెన్యూర్‌పై 14 వేల రూపాయల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ డెలివరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇంకా అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయ్యేందుకు సుమారు 5 గంటల వరకు సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమరు 80 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. బ్యాటరీపై ఏడాది పాటు, మోటార్‌పై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తోంది. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే్ 28 ఏహెచ్ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 300 కేజీల వరకు బరువును లాగగలదు. ఇందులో డిస్క్ బ్రేక్స్ కూడా ఉంటాయి. డిజిటల్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి