లడఖ్.. సరిహద్దుల్లో పరిస్థితి ప్రశాంతం.. ఆర్మీ చీఫ్

చైనాతో గల మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే ప్రకటించారు. ఉభయ దేశాల సైనిక కమాండర్ల మధ్య జరిగిన సమావేశాలు..

లడఖ్.. సరిహద్దుల్లో పరిస్థితి ప్రశాంతం.. ఆర్మీ చీఫ్

Edited By:

Updated on: Jun 13, 2020 | 12:04 PM

చైనాతో గల మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే ప్రకటించారు. ఉభయ దేశాల సైనిక కమాండర్ల మధ్య జరిగిన సమావేశాలు చాలావరకు మంచి ఫలితాలనిచ్చాయన్నారు. ఇరు దేశాల సైనిక  దళాలు వెనక్కి మళ్ళాయని, విభేదాలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. సైనిక  కమాండర్ల స్థాయి చర్చలు జరిగిన తరువాత కూడా సమాన  హోదా గల కమాండర్ల లోకల్ లెవెల్ చర్చలు సైతం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ.. ఇలా ఇవి కొనసాగడం వల్ల ఇక ఉభయ దేశాల మధ్య విభేదాలు కూడా కొలిక్కి రావడం తథ్యమన్నారు. లడఖ్ వాస్తవాధీన రేఖ వద్ద, సిక్కిం లోనూ ఇటీవలి కాలంలో భారత, చైనా దళాల మధ్య ఘర్షణలు జరగడంతో… ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి విదితమే.. ఒక దశలో చైనా దళాలు వార్ సన్నాహాలు జరిపినట్టు కూడా తెలియవచ్చింది.

 

 

,