Enforcement Directorate: తొలిసారిగా ఒకరికి క్షమాపణలు చెప్పిన ఈడీ.. ఎందుకో తెలుసా ?

|

May 03, 2023 | 6:40 PM

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తొలిసారిగా ఒకరికి క్షమాపణలు చెప్పింది. లిక్కర్‌స్కామ్‌ ఛార్జ్‌షీట్‌లో పొరపాటుగా ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ పేరును చేర్చినట్టు తెలిపింది. వాస్తవానికి రాహుల్‌సింగ్‌ పేరును చేర్చడానికి బదులు పొరపాటున సంజయ్ సింగ్ పేరును టైప్ చేశారని వివరణ ఇచ్చింది.

Enforcement Directorate: తొలిసారిగా ఒకరికి క్షమాపణలు చెప్పిన ఈడీ.. ఎందుకో తెలుసా ?
Enforcement Directorate
Follow us on

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తొలిసారిగా ఒకరికి క్షమాపణలు చెప్పింది. లిక్కర్‌స్కామ్‌ ఛార్జ్‌షీట్‌లో పొరపాటుగా ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ పేరును చేర్చినట్టు తెలిపింది. వాస్తవానికి రాహుల్‌సింగ్‌ పేరును చేర్చడానికి బదులు పొరపాటున సంజయ్ సింగ్ పేరును టైప్ చేశారని వివరణ ఇచ్చింది. జరిగిన తప్పుకు చింతిస్తునట్లు ఎంపీ సంజయ్‌సింగ్‌కు ఈడీ తరపున కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి లెటర్‌ రాశారు.

అయితే ఈడీ తనకు క్షమాపణలు చెప్పడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఈడీ ఆప్ నేతలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈడీ అసలు టార్గెట్‌ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అని వ్యాఖ్యానించారు. అలాగే లిక్కర్‌ స్కామ్‌ పేరుతో అక్రమంగా ఆప్‌ నేతలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈడీ చేసే విచారణ అబద్ధాల మూట విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధానీ మోదీ భయపడుతున్నారని.. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారిగా ఈడీ తన పేరును పొరపాటున చేర్చి క్షమాపణలు చెప్పిందని..ఇదంతా ఓ నకిలీ దర్యాప్తని ఆరోపించారు. ప్రదానీ మోదీ పాటలకు ఈడీ ఎందుకు డ్యాన్స్ చేస్తుందంటూ వ్యగ్యంగా ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి