భోపాల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏనుగు తన మహౌట్ నరేంద్ర కపాడియాను చంపినట్లు కేసు నమోదైంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 12న బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో భన్‌పూర్ వంతెన సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చోళ్ల మందిర్ పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టుకు కట్టివేసిన ఓ ఏనుగు ఈ దాడికి పాల్పడిందని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ ఏనుగును చుట్టుపక్కల పల్లెల్లో తిప్పుతూ తద్వారా 8 నుండి 10 మంది భిక్షాటన చేస్తారని చెప్పారు. ఈ క్రమంలో భోపాల్ నగరంలోని భన్‌పూర్ బ్రిడ్జ్ వద్ద రోజూలాగానే ఏనుగును తీసుకువచ్చారు. కాగా, నిద్రిస్తున్న సమయంలో అక్కడే పడుకుని ఉన్న 6 నుంచి 8 మందిపై ఏనుగు దాడి చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మహౌట్ నరేంద్ర కపాడియా అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదిలా ఉండగా.. అదుపు తప్పిన ఏనుగు అక్కడే ఉన్న మారి కపాడియాను తొక్కి చంపేసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడిని కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఏనుగు దాడి ముందు ఏమీ చేయలేకపోయామని వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అటవీశాఖతో సమన్వయం చేసుకుని ఏనుగును తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సురేష్ చంద్ర నగర్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..