Viral Video: ఒక్కసారిగా బస్సు మీదికొచ్చిన గజరాజు.. ఆందోళనలో ప్రయాణికులు.. డ్రైవర్ ఏం చేశాడంటే..?

|

Sep 29, 2021 | 10:49 AM

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. ఇటీవల కేరళలోని తిరువిల్వామల విల్వద్రినాథ గుడిలోకి అదే గుడికి సంబంధించి ఏనుగును తీసుకొచ్చారు...

Viral Video: ఒక్కసారిగా బస్సు మీదికొచ్చిన గజరాజు.. ఆందోళనలో ప్రయాణికులు.. డ్రైవర్ ఏం చేశాడంటే..?
Elephantfinal
Follow us on

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. ఇటీవల కేరళలోని తిరువిల్వామల విల్వద్రినాథ గుడిలోకి అదే గుడికి సంబంధించి ఏనుగును తీసుకొచ్చారు. అయితే అప్పటి వరకు బాగానే గజరాజు.. ఒక్కసారిగా వింతగా ప్రవర్తించింది. ఒళ్లు విరుస్తూ బీభత్సం సృష్టించింది. దీంతో ఏగును పై నుంచి మావటివాడు కింద పడిపోయాడు. కింద పడిన అతడిపై ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించింది కూడా… తాజాగా ఓ గజరాజు ఆర్టీసీ బస్సుపై దాడి చేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. గజరాజు బస్సుపై దాడి చేసే వీడియోను ఐఏఎస్ సుప్రియ సాహు తన ట్విటర్ ద్వారా నెటిజన్లతో పంచుకోవటంతో ఈ వీడియో వైరల్ అయింది.

తమిళనాడులోని నీల్‌గిరి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు వెళ్తుండగా… ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఏనుగు హఠాత్తుగా బస్సుకు ఎదురుగా వచ్చి నిల్చుంది. గజరాజు తన దంతాలతో బస్సు ముందు అద్దంపై దాడి చేసింది. ఆ తర్వాత మరో పక్క అద్దంపై కూడా దాడి చేసింది. ఖంగుతిన్న డ్రైవర్ రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్లాడు. అయినా ఆ ఏనుగు ఊరుకోలేదు. దాడి చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తనపై నుంచి ఏనుగు దృష్టి మళ్లించేందుకు తన సీటులో నుంచి లేచి వెనక్కి వెళ్లిపోయాడు. కాసేపటికి గజరాజు వెళ్లిపోయింది. ఏనుగు వెళ్లిపోటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా అందులో ఉన్న ఒక ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ వీడియోను ఐఏఎస్ సుప్రియ సాహు తన ట్విటర్‎లో పోస్ట్ చేశారు. బస్సు డ్రైవర్ చాలా కూల్ వ్యవహరించి ఏనుగు దాడి నుంచి కాపాడారని రాసుకొచ్చారు. చాలా మంది నెటిజన్లు చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్‎పై ప్రశంసల వర్షం కురిపించారు. డ్రైవర్ ధైర్యంతో ఉండి గండం గట్టెంకించాడని అన్నారు.

 

Read Also.. Ghost Video: రాత్రి సమయంలో తలకిందులుగా నడుస్తున్న తల్లి దెయ్యం.. తల లేని బాలుడు.. ఆ ప్రాంతంలో భయాందోళన..చివరికి..