జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ శనివారంతో ముగియనుంది.ఈ ఎన్నికల పోంగ్ నేడు చివరి విడత జరగనుంది. 28డీడీసీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల బరిలో 168 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో అధికారులు 1,703 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ లో 6.30 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ పోలింగ్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కశ్మీర్ డీడీసీ ఎన్నికలను మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగుతోంది. నేటితో ఎన్నికలు ముగియనుండగా, 22న ఫలితాలు వెలువడనున్నాయి.