అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. మరికొన్ని నెలల్లోనే పలు రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరిని ఓటర్లుగా చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం సీఈవోలు మినహా అన్ని రాష్ట్రాల అధికారులు దీన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. 2024 జనవరి1ని గడువుగా పెట్టుకొని వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని సూచించింది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం (1950) ప్రకారం ఓటర్లను చేర్చడానికి జనవరి1, ఏప్రిల్1, జులై1, అక్టోబర్1 ని అర్హత తేదీలుగా నిర్ణయించారు. దీన్ని అనుసరించి జనవరి 1ని గడువుగా పెట్టుకుని ఓటర్ల వార్షిక సవరణ కార్యక్రమం చేయాలని తెలిపింది. అయితే ఈ కొత్త ఓటర్ల జాబితాను జనవరి 25న జరిగే జాతీయ ఓటర్ల జాబితాను ముందే ప్రచూరించాలని పేర్కొంది. ఇలా చేయడం వల్ల కొత్తగా చేరిన ఓటర్లకు జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున గుర్తింపు కార్డులు పంపిణీ చేయవచ్చని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..