Egg Price Hike: సామాన్యుడి జేబుకి చిల్లు.. రికార్డ్ స్థాయిలో పెరిగిన కోడి గుడ్ల ధరలు..

గత కొన్నేళ్లుగా గుడ్ల వ్యాపారులు వేసవిలో గుడ్ల ధరలు కనిష్ఠానికి ఉండేవి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎండాకాలంలోనూ గుడ్డు ధర నిలకడగా సాగింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నివేదిక ప్రకారం.. జూన్‌లో కోడిగుడ్ల హోల్‌సేల్ ధర వందకు రూ.600 దాటి గత రికార్డులన్నీ బద్దలయ్యాయి.

Egg Price Hike: సామాన్యుడి జేబుకి చిల్లు.. రికార్డ్ స్థాయిలో పెరిగిన కోడి గుడ్ల ధరలు..
Egg Price Hike

Updated on: Jul 04, 2023 | 7:43 AM

పప్పులు, కూరగాయలు , వెల్లుల్లి, అల్లం వంటి వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకూ సామాన్యుడికి ఊరటనిస్తూ గుడ్లు అతి తక్కువ ధరకే లభించాయి. అయితే ఈ సారి గుడ్డు ధర పెరుగుతూ గత రికార్డులను బద్దలు కొట్టింది. గత నాలుగు నెలలుగా కోడిగుడ్ల ధర పెరుగుతూనే ఉంది. అయితే గత ఏడాది వరకూ ఈ సీజన్‌లో గుడ్లు అతి తక్కువ ధరకే లభించేవి.

ఈసారి కోడిగుడ్ల అమ్మో అనిపిస్తుంది. హోల్ సేల్ మార్కెట్ లో వంద కోడి గుడ్ల ధర రూ. 550 నుంచి 610 రూపాయలకు చేరింది. ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో గుడ్ల ధర ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో గుడ్డు 7 నుండి 8 రూపాయలకు అమ్ముడవుతోంది, ఇది ఇప్పటికే ఢిల్లీలో 7 రూపాయలు దాటింది.

రూ.10 గుడ్డు లభిస్తోంది

ఇవి కూడా చదవండి

గత కొన్నేళ్లుగా గుడ్ల వ్యాపారులు వేసవిలో గుడ్ల ధరలు కనిష్ఠానికి ఉండేవి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎండాకాలంలోనూ గుడ్డు ధర నిలకడగా సాగింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నివేదిక ప్రకారం.. జూన్‌లో కోడిగుడ్ల హోల్‌సేల్ ధర వందకు రూ.600 దాటి గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఈ నెలలో చెన్నైలోనే అత్యధిక ధర కొనసాగుతోంది. ఇక్కడ కోడిగుడ్లు వందకు రూ.610 పలికుతోంది. రిటైల్ మార్కెట్‌లో కోడి గుడ్డు ధర 7 నుండి 8 రూపాయల వరకు ఉంది. అదే ఉడకబెట్టిన కోడిగుడ్ల ధర రూ.10గా ఉంది.

ఈ నగరాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం

చెన్నై, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్ వంటి కొన్ని నగరాల్లో నేటి ధర వందకు రూ.610. ఢిల్లీలో కోడిగుడ్ల ధర వందకు రూ.500 ఉంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కోడిగుడ్లు ఢిల్లీకి చేరుతుండటంతో ఇక్కడ ధర పెద్దగా పెరగడం లేదు.

వ్యాపారులు ఏమంటున్నారంటే 

కోడిగుడ్లు 7 నుంచి 7 రూపాయల 50 పైసలకు విక్రయిస్తున్నారని చిల్లర వ్యాపారి హరీశ్ గుప్తా తెలిపారు. వేసవిలో కోడిగుడ్లు త్వరగా పాడైపోతాయని కనుక అప్పుడు ధర పెంచినా ప్రయోజనం లేదని హరీశ్ చెబుతున్నారు. వేసవిలో కోడిగుడ్ల విక్రయాలు తగ్గాయని అన్నారు. అయితే క్రమంగా గుడ్లు ఖరీదైనవిగా మారాయి. కోడిగుడ్ల అమ్మకాలు తగ్గాయని చెప్పారు. అంతేకాదు ధర ఇంకా పెరుగుతుందని .. గతంలో రోజుకు కనీసం 10 ట్రేల గుడ్లు విక్రయించేవరమని.. ఇప్పుడు అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెబుతున్నారు. రోజుకి కనీసం 5 ట్రేలు కూడా అమ్ముడు కావడం లేదంటూ వాపోతున్నారు.

గుడ్డు ఎలా ఖరీదైదినది అంటే.. 

ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల్లో హోల్‌సేల్ మార్కెట్‌లోనే గుడ్ల ధర రూ.600గా ఉంది. రిటైల్ మార్కెట్ లో రూ.8 తక్కువకు అమ్మడం వలన నష్టాలు వస్తాయి. ఉత్తరప్రదేశ్ పౌల్ట్రీ రైతుల సంఘం అధ్యక్షుడు నవాబ్ అలీ అక్బర్ టీవీ9 డిజిటల్‌తో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలు దృష్ట్యా ప్రస్తుతం చాలా బాగుంది. ఈ సమయంలో హర్యానా, పంజాబ్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చే గుడ్ల అమ్మకాలపై షరతులు విధించబడ్డాయి. దీంతో ఇక్కడ మంచి ఇక్కడ నాణ్యమైన గుడ్లు విక్రయిస్తామని చెబుతున్నారు.

కొనుగోలుదారులు పౌల్ట్రీఫారంలోనే 30 గుడ్లు ఉన్న పెట్టెను రూ.160 నుంచి 180కి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న వాతావరణం కోళ్ల పెంపకందారులకు అనుకూలంగా ఉంది. కోళ్లకు వేసే దాణా ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తుంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత రైతులు లబ్ధి పొందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..