పెళ్లి కాని వారికి గుడ్‌న్యూస్.. ఇక నుంచి వీరికి కూడా పింఛన్
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. చాలామంది పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్య కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. సింగిల్ గా ఉండి కూడా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. చాలామంది పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్య కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. సింగిల్ గా ఉండి కూడా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరికొందకు పెళ్లి అయ్యాక పలు కారణాల వల్ల విడిపోయి ఒంటిరిగా బతుకున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకోని వారికి పింఛను ఇచ్చేలా ఓ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే ఇది పెళ్లి చేసుకోకుండా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది.
ఈ విషయాన్ని హర్యాణా సీఎం మనోహల్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. నెల రోజుల్లోపై ఈ పథకంపై నిర్ణయం తీసుకోబోతున్నామని తెలిపారు. తాజాగా కర్నాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ 60 ఏళ్ల వయసున్న పెళ్లి కాని వ్యక్తి పింఛను దరఖాస్తు చేసుకునే విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నానని ఆయనకు చెప్పారు. దీనికి స్పందించిన సీఎం ఖట్టర్.. ఇక నుంచి 45 ఏళ్లు పైబడిన పెళ్లి కాని మహిళలు, పురుషులకు నెలవారి పింఛను ఇచ్చేలా ఓ పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. అలాగే దీన్ని నెలరోజుల్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




