ఇండియా ఎకానమీ మరీ దిగజారిందట.. ఐఎంఎఫ్ షాకింగ్ న్యూస్

| Edited By:

Oct 09, 2019 | 4:49 PM

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వృద్ది రేటు మరీ బలహీనంగా.. నత్తనడకన సాగుతోందట. ముఖ్యంగా ఇండియా లో ఇది మరీ దారుణంగా ఉందని ఐఎంఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా అంటున్నారు. ‘ గ్లోబల్ ఎకానమీ ‘ ఎగుడు, దిగుడులతో నడుస్తోంది. అందులోనూ ఈ ఏడాది దీని ప్రభావం ఎక్కువగా ఉండడం ఖాయం ‘ అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు 90 దేశాలు వృద్ది రేటులో మందగతిన కొనసాగుతున్నాయని, అందులోనూ 2019.. 20 ఆర్ధిక సంవత్సరానికి […]

ఇండియా ఎకానమీ మరీ దిగజారిందట.. ఐఎంఎఫ్ షాకింగ్ న్యూస్
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వృద్ది రేటు మరీ బలహీనంగా.. నత్తనడకన సాగుతోందట. ముఖ్యంగా ఇండియా లో ఇది మరీ దారుణంగా ఉందని ఐఎంఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా అంటున్నారు. ‘ గ్లోబల్ ఎకానమీ ‘ ఎగుడు, దిగుడులతో నడుస్తోంది. అందులోనూ ఈ ఏడాది దీని ప్రభావం ఎక్కువగా ఉండడం ఖాయం ‘ అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు 90 దేశాలు వృద్ది రేటులో మందగతిన కొనసాగుతున్నాయని, అందులోనూ 2019.. 20 ఆర్ధిక సంవత్సరానికి భారత రేటు 0.3 శాతానికి తగ్గుతున్న దృష్టాంతాలు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు. ఇది ఆశించిన దానికన్నా చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. 2020 లో ఆర్థిక వృద్ది రేటు కాస్త పెరిగే సూచనలు ఉన్నప్పటికీ.. పెద్దగా ఫలితాలు ఉండబోవని ఆమె అన్నారు. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్, ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఈ వార్ లో ప్రతివారూ నష్టపోవాల్సిందే అని క్రిస్టలీనా జార్జీవా వ్యాఖ్యానించారు.

2019.. 20 ఆర్ధిక సంవత్సరంలో ఎకానమీ ఎందుకు ఇంతగా దిగజారిందో అంచనా వేయవలసి ఉంటుందని, ఈ దశాబ్ద కాలంలోనే ఎందుకు ఇంత తక్కువగా ఉందో ఆర్ధిక నిపుణులు కనుగొని,, దీన్ని సరిదిద్ధేందుకు అవసరమైన సూచనలు చేయాలని ఆమె కోరారు. రెండేళ్ల క్రితం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ది దశలోకి వెళ్ళింది. కానీ ప్రస్తుతం మందగమన స్థితి కొనసాగుతోంది అన్నదామె.. అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో నిరుద్యోగ సమస్య రికార్డు స్థాయిలో ఉందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గత కొన్ని త్రైమాసికాల్లో తగ్గుతూ వఛ్చిన భారత ఎకానమీ రాబోయే కాలంలో మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనవచ్ఛునని రిజర్వ్ బ్యాంకు కూడా ఇటీవల తెలిపింది. ఈ నెలకు గాను తాను సమర్పించిన మానిటరీ పాలసీ రిపోర్టులో ఆర్బీఐ.. దేశంలో డొమెస్టిక్, గ్లోబల్ హెడ్ విండ్స్ (దేశీయ, అంతర్జాతీయ) పరిణామాల ప్రభావం వృద్ది రేటుపై పడిందని పేర్కొంది. వివిధ కారణాలవల్ల ప్రయివేటు పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయని, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు ఆశించినంత ప్రగతిని సాధించలేకపోవడం కూడా ఇందుకు దారి తీసిందని ఈ నివేదిక విశ్లేషించింది. ఉపాధి కల్పన తగ్గిపోయింది. కార్పొరేట్ టాక్స్ రేట్లు తగ్గడం, బ్యాంకు రుణాల మంజూరు ‘ సత్తా ‘ క్షీణించడం వంటి వాటిని ఈ రిపోర్టు ప్రస్తావించింది. అయితే .. బ్యాంకింగ్ వ్యవస్థను సంస్కరించడం వల్ల కొంతమేరకు పరిస్థితి మెరుగు పడవచ్ఛునన్న ఆశాభావాన్ని కూడా రిజర్వ్ బ్యాంకు వ్యక్తం చేసింది.