శివసేన ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు… నగదు అక్రమ రవాణా, లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా కోరిన ఈడీ…

మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయక్ కు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు డిసెంబర్ 5న జారీ చేసింది. శివసేన ఎమ్మెల్యేను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

శివసేన ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు... నగదు అక్రమ రవాణా, లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా కోరిన ఈడీ...
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2020 | 1:24 PM

మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయక్ కు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు డిసెంబర్ 5న జారీ చేసింది. శివసేన ఎమ్మెల్యేను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అయితే, శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌కు ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కొడుకు కూడా…

శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయక్ కొడుకు విహంగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అతడికి ప్రైవేట్ సంస్థతో ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 24న ఈడీ ఎమ్మెల్యే ఇంటిని తనిఖీ చేసింది. అయితే, ఆ సమయంలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు హోం క్వారంటైన్ లో ఉన్నారు. తాను తన కొడుకును తీసుకుని విచారణకు హాజరైతానని అన్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే తండ్రీకొడుకులకు ఈడీ నాలుగు సార్లు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందించింది. వారు మాత్రం విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకుకు ప్రైవేట్ సంస్థ జరిగిన ఆర్థిక లావాదేవీల్లో తప్పులు జరిగాయని… ఈడీ దగ్గర ప్రాథమిక ఆధారాలున్నాయి.