
సుశాంత్ సింగ్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్ డీలర్, గోవా హోటల్ యజమాని కూడా అయిన గౌరవ్ ఆర్యను ఈడీ ప్రశ్నించింది. డ్రగ్స్ సరఫరాపై రియాకు, ఇతనికి మధ్య నడిచిన ఫోన్ చాటింగ్ బయటపడిన సంగతి తెలిసిందే. ఆ చాటింగ్ ని రియా డిలీట్ చేసినప్పటికీ మళ్ళీ ‘రిట్రీవ్’ చేసి చూస్తే అసలు విషయం వెల్లడైంది. తాను సుశాంత్ ని ఎప్పుడూ కలుసుకోలేదని, కానీ 2017 లో రియాను కలుసుకున్నానని గౌరవ్ ఆర్య చెప్పినట్టు సమాచారం, ఇక కపిల్ ఝవేరీ, కైలాష్ రాజ్ పుత్, అబూ అస్లం అజ్మీ అనే మరో ముగ్గురు డ్రగ్ డీలర్లకు, ఇతనికి మధ్య గల సంబంధాలపై కూడా ఈడీ ఇతడిని విచారించింది. వీరిలో కపిల్ ని గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. రూ. 40 కోట్ల డ్రగ్ రాకెట్ లో ఇతని యవ్వారాన్ని పోలీసులు రట్టు చేశారు. మరోవైపు కైలాష్ రాజ్ పుత్ కూడా తక్కువనవాడేమీ కాదు. క్రిమినల్ అయిన ఇతగాడు ఇండియాలోనూ, విదేశాల్లోనూ డ్రగ్ దందా నడిపిస్తున్నాడు.
అయితే గౌరవ్ ఆర్యపై మాత్రం గోవాలో ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలుస్తోంది.