#COVID19 కరోనా కాదు.. ఆర్ధిక పరిస్థితే కీలకం.. కాంగ్రెస్ నేతల వాదన

|

Mar 23, 2020 | 3:39 PM

యావత్ ప్రపంచం కరోనా వైరస్ నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతుంటే... ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కరోనా కాదు.. ఆర్థిక పరిస్థితి సంగతి చూడండి అంటున్నారు.

#COVID19 కరోనా కాదు.. ఆర్ధిక పరిస్థితే  కీలకం.. కాంగ్రెస్ నేతల వాదన
Follow us on

Congress leaders saying economy first.. corona next: యావత్ ప్రపంచం కరోనా వైరస్ నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతుంటే… ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కరోనా కాదు.. ఆర్థిక పరిస్థితి సంగతి చూడండి అంటున్నారు. అసలు బతికితే కదా లెక్కలు.. గట్రా చూసుకునేది… ఈ బేసిక్ పాయింట్ ని కాంగ్రెస్ నేతలు మరిచి పోతున్నారు అంటూ నిలదీస్తున్నారు నెటిజెన్లు.

కరోనా ధాటికి జనం బెంబేలెత్తి పోతున్నారు. నియంత్రించే దారేదంటూ ప్రభుత్వాలు బుర్రలు గోక్కుంటున్నాయి. కంట్రోల్ చేసిన దేశాలను ఆదర్శంగా తీసుకుని పాజిటివ్ కేసులను క్వారంటైన్ చేస్తూ, విదేశీ ప్రయాణికులను మినిమైజ్ చేస్తూ, ప్రజా సంచారంపై ఆంక్షలు విధిస్తున్నారు. ఒకే సారి ఆంక్షలు పెడితే ఆచరణ అసాధ్యం కాదంటూ.. ముందుగా జనతా కర్ఫ్యూతో ముందుకొచ్చి ఆ తర్వాత లాక్ డౌన్ ని కొనసాగించాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒక వైపు ఇంతటి ప్రయత్నాలు కొనసాగుతుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం జనతా కర్ఫ్యూ అయిపోయింది కదా ఇక ఆర్థిక పరిస్థితిని సరిదిద్దండి అని ప్రధానిపై కామెంట్స్ చేస్తున్నారు.

అంటే ఒకరోజు జనతా కర్ఫ్యూతోనే కరోనా వైరస్ పూర్తిగా నియంత్రించబడింది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఈ మేరకు ట్వీట్ చేయడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కరోనా ఒక్కరోజులో పోయేది కాదు.. అంత తేలికగా తీసుకునేది కాదు.. ఆ మాత్రం తెలియదా సర్ అంటూ వ్యంగ్యంగా అడుగుతున్నారు.

అయితే చిదంబరం ట్వీట్ పై పెల్లుబికిన వ్యతిరేకతతో డ్యామేజ్ కంట్రోల్ పని మొదలు పెట్టారు కాంగ్రెస్ నేతలు. కరోనా వైరస్ సృష్టించిన గందర గోళం వాళ్ళ స్టాక్ మార్కెట్స్ దగ్గరనించి చిన్న వ్యాపారస్తుల దాక ఆర్ధిక పరిస్థితి కుప్ప కూల్ పరిస్థితి కనిపిస్తోందని, దాన్ని చక్క దిద్దే చర్యలను కూడా సమాంతరంగా చిదంబరం ఉద్దేశం అని. అది కరెక్ట్ కావచ్చంటున్నా నెటిజన్లు.. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న నానుడిని గుర్తు చేస్తున్నారు.