
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుండి EVM బ్యాలెట్ పేపర్ల లేఅవుట్‌ను మార్చడానికి భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. 1961 ఎన్నికల నిర్వహణ నియమాలలోని రూల్ 49B కింద నిర్దేశించిన ఈ నిబంధన ప్రకారం.. అభ్యర్థుల ఫొటోలు ఇప్పుడు కలర్‌లో ముద్రించనున్నారు. గతంలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోల స్థానంలో కలర్ ఫొటోలను ముద్రించనున్నారు. ఫొటో కోసం కేటాయించిన ప్లేస్‌లో మూడొంతుల భాగాన్ని ఈ చిత్రం కవర్ చేస్తుంది. దీంతో ఓటర్లు అభ్యర్థుల ముఖాలను మరింత స్పష్టంగా చూడగలరు. అదనంగా బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి సీరియల్ నంబర్ మరింత స్పష్టంగా ఉంటుంది.
గతంలో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, సీరియల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే ఉండేవి, ఫోటోలు లేకపోవడం లేదా మోనోక్రోమ్‌లో ఉండటం, ఫొటో ఉన్నా.. దాని సైజ్ చాలా చిన్నగా ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం.. బ్యాలెట్లను ఓటర్లకు మరింత అనుకూలంగా మార్చడానికి, పోలింగ్ బూత్‌లలో గందరగోళాన్ని తగ్గించడానికి డిజైన్. ప్రింట్ రెండింటినీ మార్చారు.
ఎన్నికల ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మెరుగుపరచడానికి, ఓటర్ల సౌలభ్యాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం గత ఆరు నెలలుగా చేపట్టిన 28 కార్యక్రమాలపై ఈ చొరవ రూపొందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి