Earthquake In Delhi NCR: ఉత్తరభారతాన్ని వణికించిన భూ ప్రకంపనలు.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కంపించిన భూమి

Earthquake In Delhi NCR: రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. పలు భవనాలు, రోడ్లు స్వల్ప ప్రభావం కనిపించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం మంగళవారం (3 అక్టోబర్ 2023) మధ్యాహ్నం 2:25 గంటలకు సంభవించింది. దీని కేంద్రం నేపాల్‌లో ఉంటుందని అంచనావ వేశారు. దీని లోతు భూమి ఉపరితలం నుండి 10 కి.మీ ఉంటుందని అంచా వేశారు. 

Earthquake In Delhi NCR: ఉత్తరభారతాన్ని వణికించిన భూ ప్రకంపనలు.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కంపించిన భూమి
Delhi Earthquake

Updated on: Oct 03, 2023 | 3:36 PM

ఉత్తరభారతాన్ని భూ ప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాలు వణికిపోయాయి..  భూకంపం బలమైన ప్రకంపనలను అనుభవించారని మీకు తెలియజేద్దాం, అయితే కార్యాలయాలలో కూడా ఫ్యాన్లు, లైట్లు వణుకుతున్నట్లు కనిపించాయి. ఢిల్లీతో పాటు హర్యానా,ఉత్తరప్రదేశ్‌.పంజాబ్‌లో కూడా భూమి కంపించింది. చాలామంది జనం భయంతో పరుగులు పెట్టారు.

నేపాల్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత మంగళవారం ఢిల్లీ , ఎన్‌సిఆర్ ప్రాంతంలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2.20 గంటలకు 4.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించిన తరువాత, దేశంలో వేగంగా సంభవించిన రెండవ భూకంపం ఇది.

భూకంప బలమైన ప్రకంపనలను అనుభవించారు, అయితే కార్యాలయాలలో కూడా ఫ్యాన్లు, లైట్లు వణుకుతున్నట్లు కనిపించాయి. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు నిరంతరంగా భూకంపం సంభవించింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, బరేలీలో కూడా భూకంపం సంభవించింది.

ముందే ఊహించిన నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు

నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అనే శాస్త్రవేత్త సోమవారం (అక్టోబర్ 2) పాకిస్థాన్‌లో భూకంపం సంభవించవచ్చని అంచనా వేసినప్పటికీ.. భారతదేశంలో ప్రకంపనలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టర్కీ, సిరియాలో వచ్చిన భూ ప్రకంపనలను ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ముందే అంచనా వేశారు. భూకంప కోణం నుండి చాలా సున్నితంగా ఉండే జోన్-5లో ఢిల్లీ పరిగణించబడుతుంది.

భూకంపం రావడంతో ఇళ్ల నుంచి జనం భయంతో పరుగులు పెట్టారు. సౌత్ ఢిల్లీలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థి క్లాస్ బ్లాక్ బోర్డ్ పగిలిపోయిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఢిల్లీలో కూడా బలమైన భూకంపం వచ్చినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి