Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు..

|

Feb 22, 2023 | 3:03 PM

దేశ రాజధాని ఢిల్లీ, యూపీలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి పరుగులు తీశారు.

Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు..
Earthquake
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ, యూపీలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి పరుగులు తీశారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిసరాల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. ఉత్తరాఖండ్ లో సైతం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా నేపాల్ దేశంలో సైతం భూకంప సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2గా తీవ్రత నమోదైంది.

కాగా.. భూ ప్రకంపనలతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అంతకుముందు కూడా ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా.. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో అర్ధంకాక బయటకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు.

అంతకుముందు తమిళనాడు చెన్నై నగరం కూడా భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. భూప్రకంపనలతో స్థానికులు బయటకు పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..