Earthquake: మహారాష్ట్రలోని నాందేడ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత..?

|

Oct 22, 2024 | 1:02 PM

నాందేడ్ జిల్లాలో మంగళవారం ఉదయం 6.52 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్‌గావ్ తాలూకాలోని సావర్‌గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది. అయితే, భూకంప తీవ్రతకు..

Earthquake: మహారాష్ట్రలోని నాందేడ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత..?
Earthquake
Follow us on

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం మోస్తారు భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఒక ప్రకటన చేసింది. నాందేడ్ నార్త్ సిటీ, హద్గావ్, అర్ధపూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. నాందేడ్ జిల్లాలో మంగళవారం ఉదయం 6.52 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్‌గావ్ తాలూకాలోని సావర్‌గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం ఉదయం 6.52 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 19.38 ఉత్తర అక్షాంశం, 77.46 తూర్పు రేఖాంశంలో ఉంది. భూమి ఉపరితలంలో 5 కి.మీ లోతులో ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి కిషోర్ కుర్హే తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.