Earth Quake:తమిళనాడులో తెల్లవారుజామున భూకంపం.. భయంతో వణికిన జనం!

|

Nov 29, 2021 | 1:22 PM

తమిళనాడులో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.17 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో నమోదైంది.

Earth Quake:తమిళనాడులో తెల్లవారుజామున భూకంపం.. భయంతో వణికిన జనం!
Earthquake
Follow us on

Tamil Nadu Earth Quake: తమిళనాడులో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.17 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంపం సంభవించినప్పుడు చాలా మంది ప్రజలు నిద్రలో ఉన్నారు. తక్కువ తీవ్రత కారణంగా, చాలా మంది ప్రజలు దాని ప్రకంపనలను గమనించలేకపోయారు. ఇదిలావుండగా మరికొన్నిచోట్ల కొంత మంది భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా దక్షిణ భారతదేశంలో అనేక సార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి.

అయితే, భూకంప దాటికి కొన్ని చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు.

Read Also… Coronavirus: మహారాష్ట్రాలో ఒమిక్రాన్‌ కలకలం..? సౌతాఫ్రిక నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌..