India-China: చైనా విదేశాంగ మంత్రి ఆకస్మిక భారత్ పర్యటన.. వాంగ్‌ టూర్‌లో ఆంతర్యం ఇదేనా..?

భారత్‌లో ఆకస్మిక పర్యటనకు వచ్చారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ. చైనాతో పాటు ఇండియా కూడా ఆయన పర్యటన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాయి. కాబూల్‌ నుంచి విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కానీ వాంగ్‌ వస్తున్న సంగతి బయటకు రాలేదు..

India-China: చైనా విదేశాంగ మంత్రి ఆకస్మిక భారత్ పర్యటన.. వాంగ్‌ టూర్‌లో ఆంతర్యం ఇదేనా..?
Eam Jaishankar Wang Yi Bila

Updated on: Mar 25, 2022 | 8:21 PM

భారత్‌లో ఆకస్మిక పర్యటనకు వచ్చారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ(Chinese FM Wang Yi ). చైనాతో పాటు ఇండియా కూడా ఆయన పర్యటన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచింది. కాబూల్‌ నుంచి విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కానీ వాంగ్‌ వస్తున్న సంగతి బయటకు రాలేదు. ఇంతకీ వాంగ్‌ పర్యటన ఆంతర్యం ఏంటి..? గాల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత భారత్‌, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2020 జూన్‌లో జరిగిన ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య హై ప్రొఫైల్‌ మీటింగ్‌ జరగలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఢిల్లీ వచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌తో భేటీ అయ్యారు. దీనికి ముందు నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్‌ ధోవల్‌ను కలిశారు. ధోవల్‌, వాంగ్‌ చాలా కాలంగా ఇరు దేశాల సరిహద్దు చర్చలకు ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. దాంతో బోర్డర్‌ ఇష్యూస్‌తో పాటు ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌పై కూడా వారిద్దరూ చర్చించారు. సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించే విషయం చర్చకు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు బెటర్‌ అయ్యేందుకు అడ్డంకులను తొలగించే అంశంపైనా చర్చించారు. వాంగ్‌తో భేటీ విషయాన్ని జయశంకర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

వాంగ్‌ పర్యటనను భారత్‌, చైనా సీక్రెట్‌గా ఉంచాయి. వాంగ్‌ ఢిల్లీ వచ్చే ముందు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో పర్యటించారు. పాక్‌లో ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన విషయాలు పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారం. చైనాతో సహా ఇతర దేశాలకు మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ హీట్‌లోనే వాంగ్‌ ఇండియా వచ్చారు. ఈ ఏడాది చైనాలో జరగనున్న బ్రిక్స్‌ సమావేశాలకు ప్రధాని మోదీని ఆహ్వానించడం కూడా వాంగ్‌ పర్యటన ముఖ్య ఉద్దేశం.

ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..