రూ.500తో మొదలై కోటికి అమ్ముడుపోయింది.. మోదీ కానుకలకు భారీ రేటు

| Edited By:

Sep 18, 2019 | 8:41 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పలువురు ఇచ్చిన బహుమతులను ఆన్‌లైన్ ద్వారా వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అందులో వెండి కలశం, మోదీ చిత్రంతో ఉన్న ఫొటో స్టాండ్‌, దేశ, విదేశాల పర్యటనల సందర్భంగా ప్రధానికి వచ్చిన జ్ఞాపికలు, కానుకలను పెట్టారు. అందులో గుజరాత్‌ సీఎం రూపానీ, మోదీకి ఇచ్చిన వెండి కలశం రూ. 1,00,00,300 పలికింది. రూ. 18వేలతో ప్రారంభమైన వెండి కలశం వేలం సెప్టెంబరు 16తో ముగిసింది. వేలంలో ఈ కలశం ఐదు రెట్లు ఎక్కువకు […]

రూ.500తో మొదలై కోటికి అమ్ముడుపోయింది.. మోదీ కానుకలకు భారీ రేటు
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పలువురు ఇచ్చిన బహుమతులను ఆన్‌లైన్ ద్వారా వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అందులో వెండి కలశం, మోదీ చిత్రంతో ఉన్న ఫొటో స్టాండ్‌, దేశ, విదేశాల పర్యటనల సందర్భంగా ప్రధానికి వచ్చిన జ్ఞాపికలు, కానుకలను పెట్టారు. అందులో గుజరాత్‌ సీఎం రూపానీ, మోదీకి ఇచ్చిన వెండి కలశం రూ. 1,00,00,300 పలికింది. రూ. 18వేలతో ప్రారంభమైన వెండి కలశం వేలం సెప్టెంబరు 16తో ముగిసింది. వేలంలో ఈ కలశం ఐదు రెట్లు ఎక్కువకు అమ్ముడుపోవడం విశేషం.

ఇక మోదీ చిత్ర పటంతో ఉన్న ఫొటో స్టాండ్‌కు కూడా ఏకంగా రూ. రూ. 1,00,00,100 పలికింది. రూ.500తో ప్రారంభమైన ఈ ఫొటో స్టాండ్ వేలం ఏకంగా కోటికి పైనే పలకడం విశేషం. అలాగే లేగదూడతో ఉన్న ఆవు విగ్రహం ఈ-వేలంలో రూ. 51లక్షలకు అమ్ముడైపోయింది. కాగా మోదీకి వచ్చిన 2,700లకు పైగా కానుకలు, జ్ఞాపికలను సెప్టెంబరు 14 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వేలానికి పెట్టారు. అక్టోబరు 3 వరకు ఈ ఆన్‌లైన్ వేలం కొనసాగనుంది. ఈ వేలం ద్వారా సమకూరిన మొత్తాన్ని ‘నమామి గంగ’ కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నారు. గతంలో కూడా ఆయన తన కానుకలను వేలం పెట్టి.. ఆ డబ్బును నమామి గంగ ప్రాజెక్ట్‌కు అందజేశారు.