ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. 99 ఏళ్ల వయసులో ఆయన మధ్యప్రదేశ్ నార్సింగ్‌పుర్‌లోని పీఠంలో తుది శ్వాస విడిచారు. స్వామి స్వరూపానంద సరస్వతి 1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయిన స్వరూపానంద.. ధర్మ ప్రచార యాత్రలు చేపట్టారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 19 ఏళ్ల వయసులో స్వాతంత్య్ర పోరాటం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఆయన తొమ్మిది నెలలు వారణాసి, ఆరు నెలలు మధ్యప్రదేశ్‌లోని జైలులో ఉన్నారు. 1950లో దండి సత్యాగ్రహం సమయంలో సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. స్వాతంత్ర్య పోరాటం తర్వాత కూడా ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో తను కర్పాత్రి మహారాజ్ ఏర్పాటు చేసిన రామరాజ్య పరిషత్‌కు ఆయన అధ్యక్షుడిగా కూడా ప్రకటించబడ్డారు.
రామ మందిర నిర్మాణం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఇది కాకుండా, జమ్ము కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌లో హైడ్రో ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. ఏకరీతి పౌర చట్టం కోసం వాదించడం వంటి అనేక అంశాలపై ఆయన మాట్లాడారు.
9 సంవత్సరాల వయస్సులో..
శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి 2 సెప్టెంబర్ 1924న మధ్యప్రదేశ్‌లోని సియోనిలోని డిఘోరి గ్రామంలో జన్మించారు. స్వామిజీ తండ్రి పేరు ధనపతి ఉపాధ్యాయ, తల్లి పేరు గిరిజా దేవి. తల్లిదండ్రులు అతనికి పోతి రామ్ ఉపాధ్యాయ అని పేరు పెట్టారు. స్వరూపానంద సరస్వతి కేవలం 9 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచిపెట్టి ధర్మ ప్రచారం కోసం ప్రయాణాన్ని ప్రారంభించారు. తన ధార్మిక యాత్రలో ఆయన కాశీకి చేరుకున్నారు. స్వామి కరపత్రి మహారాజ్ నుంచి వేదాలు, గ్రంథాల విద్యను అభ్యసించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం