దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 17న హర్యానాలో దాదాపు రూ.11,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 (UER-2) అనే రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్, గురుగ్రామ్ ప్రజలు ట్రాఫిక్ జామ్‌ల నుండి ఉపశమనం పొందనున్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే.

దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Dwarka Expressway Uer 2

Edited By: Balaraju Goud

Updated on: Aug 17, 2025 | 11:01 AM

ఢిల్లీకి కనెక్టివిటీ పెంచడం.. ప్రయాణ దూరం.. రద్దీ.. ట్రాఫిక్ తగ్గించేందుకు రెండు ఎక్స్ ప్రెస్ వేస్ అందుబాటులోకి వచ్చాయి.. 8 లైన్లు.. 6లైన్లు.. అండర్ గ్రౌండ్ టన్నెల్స్.. ఫ్లై ఓవర్లతో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) నిర్మితం అయ్యాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

మల్టీ-మోడల్ కనెక్టివిటీతో ఢిల్లీలో రద్దీని తగ్గించడంలో కీలకంగా ఈ రోడ్డు ప్రాజెక్టులు నిలవనున్నాయి. ఢిల్లీ శివారు ప్రాంతాలను అనుసంధానించేలా 76 కిలో మీటర్ల అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్ నిర్మితం అవుతుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఇకపై 20 నిమిషాల్లోనే నోయిడా నుండి ఢిల్లీ విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకోవచ్చు. ఢిల్లీ రింగ్ రోడ్‌లో రద్దీని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే తగ్గిస్తుంది.

విమానాశ్రయానికి సమీపంలోని అలీపూర్ నుండి మహిపాల్‌పూర్ వరకు అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్ ఏర్పాటయ్యింది. దాదాపు రూ. 7,716 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగింది. ముండ్కా, బక్కర్‌వాలా, నజాఫ్‌గఢ్ ద్వారకలను 4- 6 లేన్ల హైవే కలపనుంది. ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-రోహతక్ సోనిపట్ వంటి ప్రధాన మార్గాలను అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్ కలపనుంది.

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే

10.1 కిలో మీటర్ల పొడవైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే ఢిల్లీ విభాగాన్ని దాదాపు రూ.5,360 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ విభాగం యశోభూమి, DMRC బ్లూ లైన్, ఆరెంజ్ లైన్, రాబోయే బిజ్వాసన్ రైల్వే స్టేషన్ ద్వారకా క్లస్టర్ బస్ డిపోకు మల్టీ-మోడల్ కనెక్టివిటీని కూడా అందిస్తుంది.

అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II

అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) అలీపూర్ నుండి డిచాన్ కలాన్ స్ట్రెచ్‌తో పాటు బహదూర్‌గఢ్, సోనిపట్‌లకు కొత్త లింక్‌లు దాదాపు రూ.5,580 కోట్లతో నిర్మితం అయ్యింది. ఇది ఢిల్లీలోని ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్ , 9వ నెంబర్ జాతీయ రహదారి వంటి రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.

వీడియో చూడండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..