Durga Fighters: మేము సైతం…నక్సలైట్లపై పోరుకు ఛత్తీస్‌గఢ్ లో ‘దుర్గా ఫైటర్లు’..అంతా మహిళలే !

| Edited By: Anil kumar poka

Aug 23, 2021 | 12:14 PM

నక్సలైట్లు, నక్సలిజంతో నిత్యం సమస్యలెదుర్కొంటున్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో వీరిపై పోరాటానికి మహిళలు నడుం బిగించారు. 'దుర్గా ఫైటర్స్' గా వీరిని వ్యవహరిస్తున్నారు. 32 మంది మహిళలతో కూడిన కొంబాట్ (పోరాట) బృందం ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాపై ఫోకస్...

Durga Fighters: మేము సైతం...నక్సలైట్లపై పోరుకు ఛత్తీస్‌గఢ్ లో దుర్గా ఫైటర్లు..అంతా మహిళలే !
Durga Fighters All Women Force Formed To Combat Naxalism In Chhattisgarh
Follow us on

నక్సలైట్లు, నక్సలిజంతో నిత్యం సమస్యలెదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వీరిపై పోరాటానికి మహిళలు నడుం బిగించారు. ‘దుర్గా ఫైటర్స్’ గా వీరిని వ్యవహరిస్తున్నారు. 32 మంది మహిళలతో కూడిన కొంబాట్ (పోరాట) బృందం ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాపై ఫోకస్ పెట్టనుంది. వీరికి నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ఈ మహిళలు తమకు తాము ముందుకు వచ్చి అధికారులను కలిశారని.. డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ గా ఏర్పడుతామని చెప్పారని ఆయన వెల్లడించారు. వీరి ప్రతిపాదనను అంగీకరించామని, వీరిని ఇక దుర్గా ఫైటర్స్ గా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. ఈ 32 మందికి నెల రోజులపాటు వివిధ ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు కూడా ముందంజలో ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. అందుకే వీరిని ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ జిల్లాను నక్సల్ విముక్త జిల్లాగా మారుస్తామని, ఇలా అని తాము ప్రమాణం చేశామని ఈ మహిళా ఫైటర్ల కెప్టెన్ ఆషా సేన్ చెప్పారు. రక్షాబంధన్ రోజున బ్రదర్స్, సిస్టర్స్ అంతా ఒకరికొకరు తోడుగా ఉంటామని ఎలా చెప్పుకుంటారో.. అలాగే ఈ ప్రాంత ప్రజలను నక్సలైట్ల బారి నుంచి కాపాడుతామని ఆమె వెల్లడించింది. ఇప్పటికే వారివల్ల ఈ జిల్లా తీవ్రంగా నష్టపోయినట్టు ఆమె పేర్కొంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ బృందంలో తమకు కూడా స్థానం దక్కినందుకు ఆమె హర్షం వ్యక్తం చేసింది.మేమేంటో నిరూపిస్తాం అని ధీమాగా వ్యాఖ్యానించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: 300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.

తేజస్‌తో యుద్ధ విమానంలో ఉపరాష్ట్రపతి.. బెంగుళూరు హెచ్ఏఎల్ కార్య‌క్ర‌మంలో వెంక‌య్య‌నాయుడు..:Venkaiah Naidu Video.

News Watch Video: కరోనా కంటే డేంజర్…! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్ (వీడియో).

సోదరుడిని చంపిన వ్యక్తితో ప్రేమ.. 32 ఏళ్ల తర్వాత పెళ్లి.. వైరల్ వీడియో..: 32 Years Love Storie Video.