Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!

|

Dec 31, 2021 | 6:53 AM

Dry List 2022: బ్యాంకులకు ఇతర వాటికి ఎలా సెలవులు ఉంటాయో.. మద్యం షాపులకు కూడా సెలవులు ఉండనున్నాయి. కొన్ని ముఖ్యమైన రోజుల్లో మద్యం షాపులను మూసివేస్తారనే..

Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!
Follow us on

Dry List 2022: బ్యాంకులకు ఇతర వాటికి ఎలా సెలవులు ఉంటాయో.. మద్యం షాపులకు కూడా సెలవులు ఉండనున్నాయి. కొన్ని ముఖ్యమైన రోజుల్లో మద్యం షాపులను మూసివేస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు 2021 సంవత్సరం ముగిసి 2022 సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాము. ప్రతి ఏడాది డిసెంబర్‌ 31న మందుబాబులు ఫుల్లగా మద్యం తాగి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అయితే మద్యం షాపులు ఏడాది పొడవునా తెరిచి ఉన్నా.. కొన్ని ముఖ్యమైన రోజుల్లో షాపులు మూతపడనున్నాయి. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ప్రధానమైన పండగలకు, జాతీయ సెలవును ప్రకటిస్తుంటుంది. అలాగే ప్రజలు మతపరమైన, దేశ భక్తి భావాలను గౌరవించడానికి ఆయా రోజుల్లో మద్యం షాపులను మూసివేస్తుంటాయి. కొందరు మద్యం లేనిదే ఉండని పరిస్థితి ఉంటుంది. దేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం షాపుల వల్లనే అధికంగా ఆదాయం సమకూరుతుంది. అయితే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపుల సమయ వేళలు వేరేగా ఉంటాయి. ఇక డిసెంబర్‌ 31న అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయి. ఇక డ్రై డేగా పిలిచే విధానంలో భాగంగా మద్యం షాపులు కొన్ని రోజులు మూసివేసే రోజులు కూడా ఉన్నాయి.

ప్రతి సంవత్సరం అక్టోబరు 2వ తేదీతో పాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎందుకంటే ఆ రోజు గాంధీ జయంతి. ఇలాంటి సమయాలు ఏడాదిలో చాలా ఉంటాయి. అయితే అన్ని రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు మూసి ఉండవు. నిజానికి సెలవుల జాబితాలాగే మద్యం షాపుల మూసివేతకు కూడా ఏడాదిలో కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి. ఇక అలాంటి 2022లో సెలవుల జాబితాను ఎక్సైజ్‌ శాఖ విడుదల చేసింది. అయితే ఈ మద్యం షాపులు మూసివుండే రోజులు రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఇక 2022లో డ్రై డేస్‌ సందర్భంగా మద్యం దుకాణాలను ఎప్పుడు మూసివేయబోతున్నారో చూద్దాం.

ఈ ఏడాది రాష్ట్రంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అయితే ఇక్కడ ఇవ్వబడే తేదీల్లో అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు మూసి ఉండవు. కొన్ని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది.

డ్రై డే జాబితా 2022:
జనవరి 14- మకర సంక్రాంతి
జనవరి 26- గణతంత్ర దినోత్సవం
జనవరి 30- అమరవీరుల దినోత్సవం
ఫిబ్రవరి 16- గురు రవిదాస్ జయంతి
19 ఫిబ్రవరి- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి
26 ఫిబ్రవరి- స్వామి దయానంద్ సరస్వతి జయంతి
మార్చి 1- మహాశివరాత్రి
18 మార్చి- హోలీ
ఏప్రిల్ 14- డా. జయంతి మరియు మహావీర్ జయంతి
15 ఏప్రిల్ – గుడ్ ఫ్రైడే
1 మే – మహారాష్ట్ర డే
3 మే – ఈద్
10 జూలై – బక్రీద్
15 ఆగస్టు – స్వాతంత్ర్య దినోత్సవం
19 ఆగస్టు – జన్మాష్టమి
31 ఆగస్టు – గణేష్ చతుర్థి
9 సెప్టెంబర్ – గణేష్ విసర్జన్
అక్టోబర్ 2 – మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 5 – దసరా
24 అక్టోబర్ – దీపావళి
నవంబర్ 8 – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 – క్రిస్మస్

మద్యం దుకాణాలకు ఉండే ఈ సెలవులన్నీ మీ నగరంలో వర్తించాల్సిన అవసరం లేదు. ఆయా రాష్ట్రాల నిబంధనలను బట్టి ఉంటాయి. ఈ మూసివేసే విధానం రాష్ట్రాలను బట్టి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!

PAN Card: పాన్‌ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది..? పూర్తి వివరాలు